Begin typing your search above and press return to search.

మాల్దీవుల టూరిజంలో భారత్ వాటా ఎంతో తెలుసా?

దీంతో భారత్ ఆగ్రహం మాల్దీవులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:26 AM GMT
మాల్దీవుల టూరిజంలో భారత్  వాటా ఎంతో తెలుసా?
X

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ప్రపంచ అగ్ర దేశాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశం, బలంగా అభివృద్ధి చెందుతున్న దేశం, బలమైన ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ ముందు పట్టుమని ఐదులక్షల జనాభా ఉన్న దేశంలోని మంత్రులు తోకజాడించారు! దీంతో “బాయ్ కాట్ మాల్దీవ్స్” వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో భారత్ ఆగ్రహం మాల్దీవులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది.

అవును... మాల్దీవుల ప్రభుత్వంలోని మంత్రుల నోటి తీట ఈరోజు ఆ దేశానికి ఆర్థికంగా పెను సమస్యలనే తెచ్చిపెట్టబోతున్నానే కామెంట్లు వినిపిస్తున్నాయి. మాల్దీవుల పర్యాటక శాఖ గణాంకాలు చెబుతున్న వివరాలు.. వారికి భారత పర్యాటకుల అవసరం ఎంతనేది చెప్పకనే చెబుతుంది. ఈ నేపథ్యంలో మాల్దీవులపై భారత్ ఆగ్రహం శాస్వతమా, తాత్కాలికమా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ ఆగ్రహం ఉన్నంతకాలం మాత్రం తీవ్ర నష్టం తప్పదనే చెప్పాలి!

కారణం... ప్రపంచవ్యాప్తంగా మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారత్‌ నుంచే ఎక్కువగా ఉంటున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గడిచిన మూడేళ్లుగా ఏటా 2లక్షల మంది భారతీయులు మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నట్లు చెబుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి అనంతరం ప్రపంచంలో మరే దేశం నుంచి ఈస్థాయిలో పర్యాటకులు మాల్దీవులకు వెళ్లడం లేదని ఆ గణాంకాలు చెబుతున్నాయి!

మాల్దీవుల టూరిజం డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం.. గత ఏడాది 17లక్షల మంది దీవులను సందర్శించగా వీరిలో 2,09,198లక్షల మంది భారత్‌ నుంచి రాగా.. మరో 2,09,146 మంది రష్యన్లు వచ్చారని చెబుతున్నారు. అంటే... టూరిస్టుల్లో ఫస్ట్ ప్లేస్ ఇండియాది అయితే, రెండో ప్లేస్ లో రష్యా ఉంది. ఇక 1,87,118 మందితో మూడో ప్లేస్ లో చైనా ఉంది!

ఇక అంతకు ముందుటేడాది 2022 విషయానికొస్తే... అప్పుడు కూడా భారీగా సుమారు 2.40లక్షల మంది ఇండియన్స్ మాల్దీవుల్లో పర్యటించగా.. 2021లో ఈ సంఖ్య 2.11లక్షలుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో కూడా భారత్‌ నుంచి దాదాపు 63వేల మంది సందర్శించారు. అంటే ఐదులక్షల మంది జనాభా ఉన్న దేశానికి ఏటా రెండు లక్షలకు పైగా పర్యాటకులను పంపుతున్న దేశంగా భారత్ ఉంది.

కానీ ఆమాత్రం ఇంగితం లేకుండా దుర‌హంకార‌కూతలు కూడయంతో ఇకపై మాల్దీవులకు అటు టూరిజం ప్రకారమే కాకుండా ఇంకా చాలా విషయాల్లో, మరిన్ని సహకారాల్లో తాట ఊడిపోవడం కాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి! భారత్ బాయ్ కాట్ ఎఫెక్ట్ వారు త్వరలో చూడబోతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

చైనాను రిక్వస్ట్ చేసుకుంటున్నారు!:

ఇండియాతో కోల్డ్ వార్ ఎఫెక్ట్ ఏస్థాయిలో ఉండబోతుందనేది అప్పుడే మాల్దీవులకు అర్ధమైనట్లుంది. దీంతో... తమ దేశానికి ఎక్కువమంది టూరిస్టులను పంపించాలని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాను కోరుతున్నారు. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా చైనాకు చేపల ఎగుమతి పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు! ఇలా బంగారు గుడ్డుపెట్టే బాతుని నిర్లక్ష్యం చేసుకున్ని ఇప్పుడు డ్రాగన్ తో కొత్త రిక్వస్టులు పెట్టుకుంటున్నారు.