Begin typing your search above and press return to search.

ఈ నలుగురు... అంతరిక్షానికి వెళ్లనున్న భారతీయులు!

అవును... భారత అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 8:01 AM GMT
ఈ నలుగురు... అంతరిక్షానికి వెళ్లనున్న భారతీయులు!
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రయాన్, ఆధిత్య మిషన్ ప్రయోగాలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఈసారి మనవసహిత అంతరిక్ష యాత్రకు సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా గగన్ యాన్ పేరుతో చేపట్టిన ఈ భారీ ప్రయోగానికి ఇస్రో ఏర్పాటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో... ఆ వ్యోమగాములను ప్రధాని మోడీ దేశానికి పరిచయం చేశారు.

అవును... భారత అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశారు. ఈ సమయంలో వారి పేర్లను, వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు.

ఈ నేపథ్యంలో గగన్ యాన్ కోసం ఇస్రో ఎంపిక చేసిన ఈ నలుగురు వ్యోమగాములను ప్రధాని మోడీ ఈరోజు కలుసుకున్నారు. వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా వీరికి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఉత్కంఠ పెరిగిపోతుందని అంటున్నారు నెటిజన్లు!

కాగా... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఈ నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు 2019 జూన్ లో రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాంసోస్ అనుబంధ సంస్థ ఐన గ్లావ్ కాస్మోస్ తో ఇస్రో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరు రష్యాలోని శిక్షణా కేంద్రంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 మార్చి వరకూ శిక్షణ పొందారు.

దీంతో భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి ఇండియన్ టీం గా వీరు ఘనత దక్కించుకోనున్నారు. కాగా... గతంలో రాకేష్ శర్మ భారత్ తరుపున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డ్ సృష్టించారు. అయితే... ఆయన భారత నేలపై నుంచి కాకుండా... రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన నౌకలో వెళ్లారు!