జాబ్ కోసం ఆ దేశం వెళ్లద్దన్న కేంద్రం.. ఒక వేళ వెళ్తే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
ప్రపంచంలో ఏ మూలన చూసినా భారతీయులు కనిపిస్తుంటారు. ఎక్కువ శ్రమను నమ్ముకున్న ఇండియన్స్ తో పని చేయించుకునేందుకు ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఇష్టపడతాయి.
By: Tupaki Desk | 20 Sept 2025 12:11 PM ISTప్రపంచంలో ఏ మూలన చూసినా భారతీయులు కనిపిస్తుంటారు. ఎక్కువ శ్రమను నమ్ముకున్న ఇండియన్స్ తో పని చేయించుకునేందుకు ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఇష్టపడతాయి. భారత్ జనాభా పరంగా ప్రస్తుతం మొదటి దేశం. కొన్ని సంవత్సరాల ముందు చైనా దాటేసంది. ఇక్కడ శ్రమశక్తి ఎక్కువైనా ఉపాధి మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి. మధ్య తరగతి, దిగువ తరగతి ఎక్కువగా ఉన్న దేశంలో కష్టాలు కూడా ఎక్కువనే చెప్పాలి. అందుకే మన దేశస్తులు ఇతర దేశాలకు పని కోసం వెళ్తుంటారు. అయితే ఉన్నతమైన హోదాలో పనికి వెళ్లేవారికి భద్రత ఉంటుంది. కానీ కూలి నాలీ చేసుకునేందుకు వెళ్లేవారిని అక్కడి ప్రభుత్వాలు సైతం పట్టించుకోవు సరికదా.. వివిధ నేరాలు మోపి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. కొన్ని దేశాలలో ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో ఇబ్బందులు తప్పవు.
రౌడీ గ్యాంగ్ కిడ్నప్ లు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలకమైన ప్రకటన చేసింది. జాబ్ ఆశ చూపి భారత పౌరులను ఇరాన్ పంపిస్తున్నారని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు గుంజుతున్నారని వెల్లడించింది. హరియాణాలో ఇమిగ్రేషన్ సెంటర్ నడుపుతున్న అమన్ అనేక వ్యక్తి ఆస్ట్రేలియాలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి కేరళకు చెందిన ఒక హిమాన్షు మథుర్ వద్ద డబ్బు తీసుకొని ఇరాన్ పంపించాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆయనను ఆ దేశంలోని రౌడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఇండియాలోని వారి కుటుంబ సభ్యులకు రూ. కోటి డిమాండ్ చేసింది. ఆ బేరం చివరికి రూ. 20 లక్షలకు ఫైనల్ అయ్యింది. కూలి పని కోసం అప్పో సొప్పో చేసి ఇరన్ వెళ్తే.. అక్కడికి వెళ్లి ఎదురుగా రూ. 20 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో టెహ్రాన్ లో కూడా ఇలాంటి కిడ్నాప్ లే జరిగాయి. అయితే అక్కడి భారత రాయబార కార్యాలయం అక్కడి పోలీసుల సాయంతో బంధీలుగా ఉన్న వారిని విడిపించింది. ప్రభుత్వం ఇలాంటి వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుందని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు.
ఎంబసీతో టచ్ లో ఉండాలి..
ఎవరైనా విదేశాలకు జాబ్ కోసం వెళ్లాలనుకుంటే అక్కడ ఉండే భారత రాయభార కార్యాలయంలో మీ సమాచారం ఉండేలా చూసుకోవాలి. వారి సాయంతో వెళ్తే.. కిడ్నాప్ లకు గుర్యే అవకాశం ఉండదు. అలాగే గుర్తింపు పొందిన ఏజెన్సీ సంస్థల ద్వారా వెళ్తే.. మీపై పంపించిన వారికి బాధ్యత ఉంటుంది. కాబట్టి వారు మీరు గమ్యం చేసి తిరిగి వచ్చే వరకు బాధ్యులుగా ఉంటారు. దాదాపు ఆయా దేశాల్లో తెలిసిన వారు ఉంటేనే వెళ్లాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది.
