Begin typing your search above and press return to search.

కెనడాలో భారీ చోరీ .. భారత సంతతి నిందితుడు అరెస్టు

భారత్‌ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అక్కడి అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   13 May 2024 11:30 PM GMT
కెనడాలో భారీ చోరీ .. భారత సంతతి నిందితుడు అరెస్టు
X

కెనడా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో జరిగిన 400 కిలోల బంగారం బిస్కెట్ల చోరీ కేసులో మరో భారత సంతతి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అక్కడి అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. గత ఏడాది ఏప్రిల్ 17న ఈ చోరీ జరిగింది. ఎయిర్ కెనడా సంస్థ విమానం కార్గోలో వచ్చిన 22 మిలియన్ కెనేడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీ చోరీకి గురయ్యాయి.

స్విట్జర్లాంండ్ లోని జ్యూరిచ్ నుండి విమానంలో టొరొంటోలోని పియర్సన్ విమానాశ్రయానికి బంగారం బిస్కెట్లు, నగదు వచ్చాయి. బంగారం ఉన్న కంటెయినర్‌ను తొలుత ఎయిర్‌పోర్టులోని ఓ ప్రత్యేక స్థలానికి తరలించారు. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో గత నెలలో భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిధూ (54), అమిత్ జలోతా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసత్ పరమలింగం (35)లను పోలీసులు అరెస్టు చేశారు.

ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీత్ పనేసర్ (31), మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరి (42)లపై అరెస్టు వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ భారీ చోరీలో 400 కిలోల బరువున్న 6,600 గోల్డ్ బార్స్, 2.5 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీని నిందితులు దోచుకున్నారు.