Begin typing your search above and press return to search.

విదేశాల్లో డేటింగ్, భారత్‌లో పెళ్లి.. భారతీయ యువతుల తీరే వేరు!

సంబంధాల్లో స్థిరత, భద్రత ఉంటుంది. వారు తక్కువ ఎంపికల వల్ల మీ కోసం త్యాగాలకైనా సిద్ధంగా ఉంటారు." అని పేర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   4 July 2025 8:15 AM IST
విదేశాల్లో డేటింగ్, భారత్‌లో పెళ్లి.. భారతీయ యువతుల తీరే వేరు!
X

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల మధ్య ఒక పోస్ట్ ఇటీవల వైరల్ అయింది. ఇది భారతీయ యువతులు సంబంధాలను ఎలా చూస్తున్నారో, వాటిని ఎలా ఎంచుకుంటున్నారో అనే అంశంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువతి పేరుతో ఉన్న ఈ పోస్ట్‌లో, విదేశాల్లో యూరోపియన్ యువకులతో డేటింగ్ చేయడం అనుభవానికి, రొమాన్స్‌కు మంచి అవకాశమని, అయితే చివరికి పెళ్లికి మాత్రం భారతీయ పురుషులను ఎంచుకోవడం శ్రేయస్కరం అనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ అభిప్రాయాలు వ్యక్తిగత స్వేచ్ఛపై ఆధారపడి ఉన్నప్పటికీ, వాటి వెనుక ఉన్న ఆలోచనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోస్ట్‌లో ఏముందంటే?

"యూరోపియన్ యువకులతో సంబంధాలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. వారు ఆకర్షణీయులు, పొడవుగా ఉంటారు, చార్మింగ్‌గా ఉంటారు. కానీ, దీర్ఘకాలికంగా చూసినప్పుడు ఈ సంబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారు ఎప్పుడూ ‘50:50’ సిద్ధాంతాన్ని పాటిస్తారు, ఎలాంటి ఆర్థిక ఆధారపడుదల ఉండదు. ఇది చాలా మంది ఇండియన్ అమ్మాయిలకు సవాలుగా ఉంటుంది. అందుకే 20లలో ఉన్నప్పుడు అనుభవం కోసం, కొత్త అనుభూతుల కోసం యూరోపియన్‌లతో డేటింగ్ చేయండి. కానీ చివరికి పెళ్లి మాత్రం ఒక స్థిరమైన, విధేయత గల భారతీయ పురుషుడిని చేసుకోవడం మంచిది. వారికిచ్చే విలువ పెరిగిపోతుంది. సంబంధాల్లో స్థిరత, భద్రత ఉంటుంది. వారు తక్కువ ఎంపికల వల్ల మీ కోసం త్యాగాలకైనా సిద్ధంగా ఉంటారు." అని పేర్కొంటున్నారు.

ఈ అభిప్రాయంపై సోషల్ మీడియా విభజించిపోయింది. చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "సంబంధాలను ప్రయోగశాలలా చూడటం తగదు. ఒకతను చూడటానికి బావుంటే డేటింగ్‌కి, మరొకతను స్థిరంగా ఉంటాడని పెళ్లికి అంటారా?" అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంకొంతమంది తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ "ఇలాంటి ‘టెంపరరీ ఎంజాయ్‌మెంట్ – పర్మనెంట్ సెక్యూరిటీ’ అభిప్రాయాలు మన పురుషులను రెండో హ్యాండుగా చూస్తున్నట్లే" అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే, కొంతమంది ఈ పోస్ట్‌ను మహిళల స్వేచ్ఛగా చూస్తున్నారు. "మగవాళ్లు ఎలాగైతే వయస్సులో ఫ్రీగా డేటింగ్ చేసి చివరికి పెళ్లికి సిద్ధమవుతారో, అలాగే అమ్మాయిలకూ ఆ హక్కు ఉంటుంది. ఇది సమానత్వం కాదా?" అంటూ కొంతమంది పురుషులే ప్రశ్నిస్తున్నారు.

ఈ పోస్ట్‌లో కనిపిస్తున్న భావనలు కొన్ని నిజాలకు దగ్గరగా ఉంటే, కొన్ని మాత్రం సామాజికంగా కఠినంగా అనిపించవచ్చు. భారతీయ మహిళలు విదేశాల్లో కొత్త అనుభవాలను పొందడం, వాటిలో అభివృద్ధి చెందడం సహజమే. కానీ సంబంధాల విషయంలో ఆత్మగౌరవం, పరస్పర గౌరవం అనే అంశాలను మర్చిపోకూడదు.

ఈ పోస్ట్ చుట్టూ నెలకొన్న చర్చలు, సమకాలీన యువతలో మారుతున్న సంబంధాల దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సంప్రదాయాలు, ఆధునికత్వం పోటీపడుతున్న ఈ సమాజంలో ప్రేమ, పెళ్లి, డేటింగ్ అనే అంశాలపై తర్కాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎవరైనా తమ జీవనశైలిని, సంబంధాల ఎంపికను స్వేచ్ఛగా, బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మగవారైనా, మహిళలైనా నిజాయితీ, గౌరవం, స్థిరత కలిగిన బంధమే నిజమైన సంబంధం.