ఇండియన్ Vs అమెరికన్ ఇంగ్లీష్.. నిజ జీవితంలో ఈ తేడా గమనించారా?
తాజాగా ఒక ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది . అది భారతీయ ఇంగ్లీష్ వర్సెస్ అమెరికన్ ఇంగ్లీష్ లను పోల్చుతూ కొన్ని విచిత్రమైన తేడాలను ఎత్తిచూపే వీడియో.
By: Tupaki Desk | 24 Aug 2025 1:00 AM ISTగల్లీ నుండి ఢిల్లీ వరకు.. ప్రపంచ దేశాలు చుట్టేయాలన్నా ఇప్పుడు ఇంగ్లీష్ తప్పనిసరి అయిపోయింది. అంతే కాదండోయ్ నిజ జీవితంలో ఇంగ్లీష్ మాట్లాడకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా మాట్లాడే భాష ఏదైనా సరే కచ్చితంగా అందులో ఇంగ్లీష్ పదాలు వాడాల్సిందే. అంతలా ఇంగ్లీష్ ప్రాచుర్యం పొందుతోంది. దైనందిక జీవితంలో ఇంగ్లీషు పదాలు వాడకుండా స్వచ్ఛమైన మాతృభాషలో మాట్లాడేవారు చాలా తక్కువ మందే ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఇక అలాంటి నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక ఇద్దరు మిత్రులు చేసిన ఫన్నీ వీడియో ఇప్పుడు అందరిలో నవ్వు తెప్పిస్తోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు నిజమే కదా అంటూ వారికి వత్తాసు పలుకుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఒక ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది . అది భారతీయ ఇంగ్లీష్ వర్సెస్ అమెరికన్ ఇంగ్లీష్ లను పోల్చుతూ కొన్ని విచిత్రమైన తేడాలను ఎత్తిచూపే వీడియో. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ తేడా అటు నెటిజనులను కూడా పూర్తిగా నవ్వించడమే కాదు ఆలోచింప చేస్తోంది అని చెప్పవచ్చు. చాలామంది రోజువారి పదబంధాలను కొత్త వెలుగులో చూస్తున్నారు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని లలిత కుమార్ శర్మ అనే ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అందులో ఒక అమ్మాయి.. అబ్బాయి పక్కపక్కనే కూర్చుని.. అమ్మాయి అమెరికన్ ఇంగ్లీషులో.. అబ్బాయి ఇండియన్ ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వారి మధ్య వచ్చిన ఫన్నీ సంభాషణలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.
అమెరికన్ ఇంగ్లీష్ Vs ఇండియన్ ఇంగ్లీష్..
అమ్మాయి : స్టార్ట్
అబ్బాయి : షురూ సే స్టార్ట్ కర్తే హై
అమ్మాయి: రిటర్న్
అబ్బాయి: రిటర్న్ బ్యాక్ కరో
అమ్మాయి : లెట్స్ స్టార్ట్
అబ్బాయి : చలో షురూ సే స్టార్ట్ కర్తే హై
అమ్మాయి: ఫార్వర్డ్
అబ్బాయి: ఏ జీ ఫార్వర్డ్ కర్ దియా హై మైనే
అమ్మాయి : గిఫ్ట్
అబ్బాయి : ఫ్రీ కా గిఫ్ట్ మిలా హై
అమ్మాయి : సారీ
అబ్బాయి: సారీ యార్ మాఫ్ కర్ దేనా
ఇలా ఈ సంభాషణలకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు చాలామందిని కడుపుబ్బా నవ్విస్తోందని చెప్పవచ్చు.. అంతేకాదు ఈ సన్నిహితులు రెండవ రీల్ కూడా షేర్ చేయగా వీక్షకులు ఎప్పటిలాగే తాము కూడా తరచుగా ఇలా మాట్లాడుతామని ఒప్పుకుంటూ ప్రతిస్పందించడం గమనార్హం. ఇకపోతే పోస్ట్ చేసినప్పటి నుండి ఈ వీడియో ఇప్పటివరకు 3 లక్షల పైగా వీక్షణలు, వేల కామెంట్లు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ జంట చేసిన కామెంట్లను నిజజీవితంలో తాము ఉపయోగిస్తున్న పదాలను కూడా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ తేడా ఇప్పుడు అందరిని నవ్విస్తోంది అని చెప్పవచ్చు.
