Begin typing your search above and press return to search.

అమరుడా.. నీకు వందనం.. దేశ రక్షణలో తెలుగు జవాను వీరమరణం

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడే మురళీ నాయక్. కొన్నాళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   9 May 2025 3:08 PM IST
అమరుడా.. నీకు వందనం.. దేశ రక్షణలో తెలుగు జవాను వీరమరణం
X

పాకిస్థాన్ పీక నొక్కే స్థాయిలో యుద్ధం తీవ్రం అవుతున్న సమయంలో ఓ విషాద ఘటన.. భరత మాత సేవలో తరిస్తూ.. దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావించే వీర సైనికుడిని దేశం కోల్పోయింది. భారత సైన్యంలో పనిచేస్తున్న మురళి నాయక్ భరత మాత సేవలొ ప్రాణాలు అర్పించారు.

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడే మురళీ నాయక్. కొన్నాళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నాడు. తాజాగా అతడు మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. దేశ రక్షణలో మురళీనాయక్‌ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీ సీపీఐ కార్యదర్శి రామక్రిష్ణ సైతం సంతాపం తెలిపారు.

మురళీనాయక్ మృతదేశం శనివారం స్వగ్రామానికి రానుంది. భారత సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ క్షిపణి, డ్రోన్‌ దాడులకు పాల్పడుతోంది. కశ్మీర్‌ లో జరిపిన కాల్పుల్లోనే మురళీ చనిపోయినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి సరిహద్దు వెంట పాక్‌ కాల్పులు జరపగా మురళీ చనిపోయినట్లు సమాచారం.

మురళీ నాయక్‌ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువుతండాలో పెరిగారు. సోమందేపల్లిలోని విజ్ఞాన్‌ స్కూల్‌ లో చదివారు. మురళీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కల్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ మృతిపై భారత ఆర్మీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉందా.