Begin typing your search above and press return to search.

కన్నీళ్లతో బిజినెస్.. రూ.200 నుంచి రూ.1000 : వీడియో వైరల్

ఇప్పటికే ప్రపంచంలో అనేక విచిత్రమైన బిజినెస్ మోడల్స్‌ పుట్టుకొస్తున్న నేపథ్యంలో.. భారతదేశంలో కొత్తగా ఓ యువతి సోషల్ మీడియాలో వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించింది.

By:  Tupaki Desk   |   6 Sept 2025 5:00 PM IST
కన్నీళ్లతో బిజినెస్..  రూ.200 నుంచి రూ.1000 : వీడియో వైరల్
X

ఇప్పటికే ప్రపంచంలో అనేక విచిత్రమైన బిజినెస్ మోడల్స్‌ పుట్టుకొస్తున్న నేపథ్యంలో.. భారతదేశంలో కొత్తగా ఓ యువతి సోషల్ మీడియాలో వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించింది.

ఆ ఖాళీని భర్తీ చేసేలా..

జపాన్‌లో మెట్రో రైళ్లలో ప్రయాణికులను లోపలికి తోసే ఉద్యోగులు, చైనాలో ఒంటరితనాన్ని తగ్గించేందుకు పక్కన నిద్రించేవారి సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ భారతదేశంలో ఇలాంటివి లేవనే చెప్పాలి. అయితే ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఇప్పుడో యువతి ముందుకొచ్చింది.

సమస్యను బట్టి రేట్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో @storyteller_emma అనే యూజర్‌ పేరుతో ప్రసిద్ధి చెందిన ఎమ్మా… తన ప్రత్యేకమైన వ్యాపారాన్ని ప్రకటించింది. చిన్న సమస్యలైతే రూ.200, పెద్ద సమస్యలకు రూ.400, కన్నీళ్లతో కూడిన సెషన్ అయితే రూ.1000లుగా రేట్లు నిర్ణయించింది. “నీ బాధల్లో నేను నీతోనే ఉన్నాను. ఏ బాధ అయినా చెప్పు, నేను వింటాను. డబ్బు సిద్ధంగా ఉంచుకో” అని ఫన్నీ టోన్‌లో చెప్పడం ఆమె ప్రత్యేకత.

సోషల్ మీడియా లో వీడియో వైరల్

ఈ వీడియోను హాస్యభరిత హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్ చేయడంతోనే అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ప్రస్తుతం 21 లక్షల వ్యూస్, 26 వేల లైక్స్‌, 91 వేల షేర్లు, 5 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..

అయ్యో నేను ఇదే పని ఉచితంగా చేస్తున్నానంటూ హిమానీ రాజ్‌పుత్ అనే ఇన్ స్టా యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ వీడియో చూశాక నా బాధలన్నీ పోయాయంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. సూపర్ ఐడియా.. ఈ బిజినెస్ నడిపితే నేను కోటీశ్వరురాలిని అవుతానంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. నా బాధకు రూ.200 ఇస్తా.. క్యూఆర్ కోడ్ పంపండి ఇంకో యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.

కొత్త మార్గాలకు వేదిక

ఈ వ్యాపార ఐడియా మనసుని తాకింది. కొంత వినోదం, కొంత ఆధ్యాత్మికత, కొంత మనుషుల వ్యక్తిగత అవసరాలను మేళవించిన శైలి ఇది. సోషల్ మీడియా వినియోగదారుల స్పందనలు, ట్రెండ్‌ల పట్ల ఆసక్తిని బట్టి, ఇది సరదాగా మాత్రమే కాకుండా, కొత్త వ్యాపార మార్గాలను సూచించడంతో పాటు సమాజానికి ఒక హాస్యవంతమైన పాఠమని చెప్పవచ్చు.