’మేం సిద్ధం.. ఏ భూమి కాదు దూరం..’ భారత సైన్యం రణ గర్జన
అటు పాకిస్థాన్ లోనూ వణుకు పుడుతోంది. భారత్ ఎప్పుడు తమవైపు విరుచుకుపడుతుందోనన్న భయం ఉన్నప్పటికీ.. మేకపోతు గాంభీర్యం నటిస్తోంది.
By: Tupaki Desk | 26 April 2025 11:05 AM’’దేనికీ భయపడం.. ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు.. ఏ భూభాగమూ మాకు దూరమైంది కాదు.. క్లిష్టమైనది కాదు.. మే సిద్ధం.. ఎప్పుడూ సిద్ధమే’’
భారత సైన్యం రణ గర్జన ఇది.. పెహల్గామ్ దారుణం తర్వాత ప్రత భారతీయుడి రక్తమూ మరుగుతోంది.. కులమత వర్గ ప్రాంతాలకు అతీతంగా అందరిదీ ఒకటే డిమాండ్.. ప్రతీకారం తీర్చుకోవాలని.
సింధూ జలాల ఒప్పందం రద్దు.. నియంత్రణ రేఖ వెంట పహారా పటిష్ఠం.. మరోవైపు కశ్మీర్ లోనే ఉగ్రవాదుల గాలింపు ముమ్మరం.. పాక్ జాతీయులను గుర్తించి పంపించి వేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు. పాకిస్థానీలకు జారీ చేసే 14 రకాల వీసాల రద్దు.. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు .. ఇలా ఒకటేమిటి...? ఒకదాని వెంట ఒకటి చర్యలు వేగంగా జరుగుతున్నాయి.
అటు పాకిస్థాన్ లోనూ వణుకు పుడుతోంది. భారత్ ఎప్పుడు తమవైపు విరుచుకుపడుతుందోనన్న భయం ఉన్నప్పటికీ.. మేకపోతు గాంభీర్యం నటిస్తోంది. మరోవైపు పాక్ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండగా.. వారి సైన్యానికి మాత్రం మనసులో భయం పట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ పోస్ట్ చేసింది. ఇప్పటికే నేవీ తన సంసిద్ధతను తెలియజేయగా.. ఇప్పుడు ఆర్మీ కూడా కదన కుతూహలం వ్యక్తం చేసింది.
అసలే పాకిస్థాన్ తో మూడు యుద్దాలలో గెలిచిన ధైర్యం.. ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో మరుగుతున్న రక్తం.. ఈ నేపథ్యంలో తాము ఎలాంటి పరిస్థితులకైనా భయపడేది లేదని.. ఎవరూ తమను ఆపలేరని పోస్ట్ చేసింది.
అంతేకాకుండా ఏ భూభాగమూ తమకు దూరం కాదు అంటూ పరోక్షంగా పాకిస్థాన్ అంతకుమించి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా టార్గెట్ చేస్తామనే పరోక్షహెచ్చరికను జారీచేసింది. ఏదీ క్లిష్టమైనది కాదు.. మేం ఎప్పుడూ సిద్ధమే అని ప్రకటించడం వెనుక పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా ముందుకే వెళ్తామని ప్రకటించింది.