Begin typing your search above and press return to search.

భారత్ లో జననాల రేటు ఎంతో తెలుసా... అమెరికా కంటే ఎక్కువ

ఈ సందర్భంగా 2021లో ప్రపంచంలోని పలుదేశాల్లో జననాల రేటు వివరాలను తాజాగా ఓ సర్వే వెల్లడించింది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:30 PM GMT
భారత్ లో జననాల రేటు ఎంతో తెలుసా... అమెరికా కంటే ఎక్కువ
X

ప్రపంచ జనాభాలో ఆరవ వంతు ఉన్న భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన సంగతి తెలిసిందే. ఐరాస అంచానాల ప్రకారం అంచనాల ప్రకారం, ఏప్రిల్ 2023 చివరి నాటికి 1,425,775,850 జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాను కలిగి ఉన్న చైనాను భారతదేశం అధిగమించింది. ఐరాస ప్రపంచ జనాభా డాష్‌ బోర్డ్ ప్రకారం..భారతదేశ జనాభా ఇప్పుడు 1.428 బిలియన్ల కంటే ఎక్కువ!

ఈ సందర్భంగా 2021లో ప్రపంచంలోని పలుదేశాల్లో జననాల రేటు వివరాలను తాజాగా ఓ సర్వే వెల్లడించింది. జనన రేటు అనేది ఒక సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది వ్యక్తులకు జీవించి ఉన్న జననాల సంఖ్య అనేది తెలిసిన విషయమే. ఈ సర్వే లెక్కల ప్రకారం... భారత్ లో జననాల రేటు ప్రతీ వెయ్యిమందికీ 16.4 గా ఉంది. అగ్రరాజ్యంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు తర్వాత స్థానంలో ఉన్నాయి.

ఇక ఆ తర్వాతి స్థానాల్లో 11 శాతంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఆ తర్వాత 10.9 శాతంతో ఫ్రాన్స్, 10.1 శాతంలో యునైటెడ్ కింగ్ డం, 9.6శాతంతో కెనడా, 9.6శాతంతో జర్మనీ ఉన్నాయి. ఇదే క్రమంలో 9.6శాతంతో రష్యా, 7.5 శాతంతో చైనా, 6.8 శాతంతో ఇటలీ, 6.6 శాతంతో జపాన్, 5.1 శాతంతో దక్షిణ కొరియాలు ఉన్నాయి.

కాగా... 1960లో ప్రతీ వెయ్యి మందికీ భారత్ లో జననాల రేటు 42.5 గా ఉండేది. అయితే 2021 నాటికి మాత్రం ఆ రేటు 16.4 గా ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో భారతదేశంలో మరణాల రేటు ప్రతీ వెయ్యిమందికీ 6.6 గా ఉంది. 2023 అంచనా ప్రకారం... పురుషుడు ఆయుర్దాయం 70.5 సంవత్సరాలు కాగా... స్త్రీ ఆయుర్దాయం 73.6 సంవత్సరాలు. ప్రధానంగా ఇక్కడ ఆందోళన కలిగిస్తోన్న అంశం ఏమిటంటే... భారత్ లో శిశు మరణాల రేటు 1000కి 29.94 గా ఉండటం.

ఇక స్త్రీపురుష నిష్పత్తి విషయానికొస్తే... భారతదేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల విషయానికొస్తే... ఇక్కడ ప్రతీ 1000 మంది పురుషులకూ 947 మంది స్త్రీలు ఉండగా... గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 941 మంది స్త్రీలు ఉన్నారు.