Begin typing your search above and press return to search.

2050 నాటికి ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో భారత్ వాటా ఇదే!

ఈ క్రమంలోనే భారత్ లో వృద్ధుల జనాభా 254 శాతం వృద్ధిని సాధించగలదని సర్వే సంస్థ అంచనా చేసింది

By:  Tupaki Desk   |   18 April 2024 5:03 AM GMT
2050 నాటికి ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో భారత్ వాటా ఇదే!
X

జపాన్ లో రానున్న 25 - 26 సంవత్సరాల్లో వృద్ధుల సంఖ్య బారీగా పెరిగిపోబోతుందని ప్రభుత్వ అనుబంధ పరిశోధనా సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ అంచనాల ప్రకారం... 2050 నాటికి జపాన్‌ లో ఒంటరిగా నివసిస్తున్న సీనియర్ సిటిజన్ల సంఖ్య సంఖ్య 47% ఉండొచ్చని వెల్లడిస్తున్నారు. ఇదే క్రమంలో భారత్ లో కూడా 2050 నాటికి వృద్ధుల సంఖ్య ఎక్కువగానే పెరుగుతుందని తాజా సర్వే వెల్లడించింది.

అవును... 2050 నాటికి ప్రపంచ వృద్ధుల జనాభాలో భారతదేశం వాటా సుమారు 17 శాతం వరకు ఉంటుందని సీ.బీ.ఆర్.ఈ. సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో జనాభా మార్పులు, పెరుగుతున్న ఆయుర్దాయం, నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం వృద్ధులలో అభివృద్ధి చెందుతున్న ప్రాధాన్యతల ద్వారా ముందుకు సాగే సీనియర్ కేర్ సెక్టార్‌ లో గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తుంది.

ఈ క్రమంలోనే భారత్ లో వృద్ధుల జనాభా 254 శాతం వృద్ధిని సాధించగలదని సర్వే సంస్థ అంచనా చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభా విభాగంగా మారిందని తెలిపింది. ఈ లెక్కప్రకారం... 2050 నాటికి భారతదేశం 340 మిలియన్ల వరకు వృద్ధులను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. ఇది ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో సుమారు 17 శాతంగా ఉంటుందని సీ.బీ.ఆర్.ఈ. ఇండియా చైర్మన్ అన్షుమాన్ వెల్లడించారు!

ఇదే క్రమంలో ప్రధానంగా... గత దశాబ్దంలో భారత్ లో సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్‌ ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను కలిగి ఉందని.. ఇది ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ ను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ జీవన సౌకర్యాల కోసం డిమాండ్ గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18,000 సీనియర్ లివింగ్ సౌకర్యాలు ఉన్నాయని చెబుతున్నారు. భవిష్యత్తులో వీటి డిమాండ్ విపరీతంగా పేరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.