Begin typing your search above and press return to search.

చంద్రుడిపై భారత్ - చైనా రోవర్లు...పలకరించుకుంటాయా?

అవును... చందమామ పైకి భారత్ పంపిన విక్రమ్ ల్యాండర్ తనపని తాను చేసుకుపోతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Aug 2023 9:02 AM GMT
చంద్రుడిపై భారత్ - చైనా రోవర్లు...పలకరించుకుంటాయా?
X

ప్రపంచంలో ఇప్పటికే ఏ దేశానికి సాధ్యం కాని అపురూప ఘట్టాన్ని భారత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జాబిలి దక్షిణ దృవంపై చంద్రయాన్ - 3 అడుగుపెట్టింది. అయితే అక్కడే దగ్గరలో భారత్ పక్కనున్న చైనా కు సంబంధించిన రోవర్ కూడా ఉంది. దీంతో.. ఈ రెండు రోవర్లూ పలకరించుకుంటాయా.. అసలు వీటిమధ్య ఉన్న దూరం ఎంత అనే విషయం ఆసక్తిగా మారింది.

అవును... చందమామ పైకి భారత్ పంపిన విక్రమ్ ల్యాండర్ తనపని తాను చేసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్ ను ప్రశంసల వర్షంలో తడిచి ముద్ద చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడిపై ఉష్ణోగ్రత, మూలకాలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఇది ఇస్రోకు పంపుతోంది.

ఆ సంగతి అలా ఉంటే... అదే సమయంలో చైనా 2019లోనే ప్రయోగించిన చాంగే 4 మిషన్ లోని యుటూ 2 రోవర్ కూడా ప్రస్తుతం చంద్రుడిపైనా తిరుగుతోంది. ఈ యుటూ 2 రోవర్ ఇంకా చంద్రుడిపై తిరుగుతూ కీలక సమాచారం పంపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మన ప్రజ్ఞాన్ రోవర్ దీన్ని చంద్రుడిపై కలిసే అవకాశం ఉందా అన్న చర్చ మొదలైంది.

రెండు పక్క పక్క దేశాలకు సంబంధించిన రెండు రోవర్ లు చంద్రుడిపై ఉండటం ఆసక్తిని కలిగించే అంశం. అయితే అవి పక్క పక్కన లేనప్పటికీ.. కలుసుకునే ఛాన్స్ ఉందా అనే చర్చ మొదలైంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ బలంగా నడుస్తోంది.

అయితే... తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రజ్ఞాన్ రోవర్ కూ, చైనాకు చెందిన యుటూ 2 రోవర్ కూ మధ్య సుమారు 1948 కిలోమీటర్ల దూరం ఉందని ఇస్రో వెల్లడించింది. మరోవైపు ఇస్రో, నాసా కనిపెట్టలేకపోయిన చంద్రయాన్ - 2 ఆచూకీ కనిపెట్టిన చెన్నై ఐటీ నిపుణుడు షణ్ముగ సుబ్రమణియన్ లెక్క ప్రకారం ఈ రెండు రోవర్ల ప్రస్తుత దూరం దాదాపు 1891 కిలోమీటర్లు గా ఉంది.

దీంతో ఈ రెండు రోవర్లు కలిసే అవకాశం దాదాపు లేనట్లే అని అంటున్నారు. అవును తాజా అంచనాల ప్రకారం ప్రజ్ఞాన్ రోవర్, చైనా రోవర్ యుటూ 2ని కలిసే అవకాశం ఎంతమాత్రం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో చైనా రోవర్‌ కు విరుద్ధంగా ప్రగ్యాన్ మిషన్ జీవితకాలం ఒక చంద్ర రోజు (సుమారు 14 భూమి రోజులు) మాత్రమే.