పహల్గామ్‌లో దాడి.. పాక్‌కు అమెరికా ఇచ్చిన ఆయుధాలను భారత్ ఎలా మట్టికరిపించిందో తెలుసా ?
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో చాలా మంది భారత్ పాకిస్తాన్‌పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
By: Tupaki Desk | 24 April 2025 4:20 PM ISTపహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో చాలా మంది భారత్ పాకిస్తాన్‌పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాకిస్తాన్ తరచూ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నందున వారు కోరుకునే దానిలో న్యాయం లేకపోలేదు. గతంలో కూడా పాకిస్తాన్ భారత్‌పై దుస్సాహసానికి పాల్పడినప్పుడల్లా తగిన గుణపాఠం చెప్పింది. ఒకప్పుడు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న పాకిస్తాన్, ఆ సమయంలో అమెరికా నుంచి అత్యాధునిక సైనిక ఆయుధాలను కొనుగోలు చేసేంది.
అమెరికా పాకిస్తాన్‌కు కొన్ని పవర్ ఫుల్ ఆయుధాలను అందించింది. వాటిని ఎవరూ నాశనం చేయలేరని అమెరికా గట్టిగా నమ్మింది. కానీ, భారత్ అమెరికా ఆ వాదనలను తప్పు అని నిరూపిస్తూ ఆ ఆయుధాలను నేలకూల్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌కు అవమానాన్ని కలిగించడమే కాకుండా, అమెరికా ప్రతిష్టను కూడా దిగజార్చింది. మరి భారత్ ఒకే దెబ్బతో కూల్చివేసిన ఆ ఆయుధాలు ఏమిటో తెలుసుకుందాం.
పాటన్ ట్యాంక్
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంటే 1965లో భారత్-పాక్ మధ్య జరిగిన ట్యాంకుల యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద పోరాటంగా పరిగణిస్తారు. పాకిస్తాన్ వద్ద అత్యాధునిక అమెరికన్ పాటన్ ట్యాంకులు ఉండగా, భారత్ వద్ద బ్రిటన్‌లో తయారైన సెంచూరియన్, రెండవ ప్రపంచ యుద్ధం నాటి షెర్మాన్ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. 1965 యుద్ధంలో పాకిస్తాన్ ఫస్ట్ ఆర్మ్‌డ్ డివిజన్ దాదాపు 200 ట్యాంకులతో భారతదేశంపై దాడి చేసింది. శత్రువు ట్యాంకులు, సైన్యం భారత సరిహద్దుల్లో 10-12 కిలోమీటర్ల వరకు చొచ్చుకు వచ్చేశాయి. ఆ సమయంలో భారత సైన్యం పాకిస్తాన్‌ను తరిమికొట్టింది. వీర అబ్దుల్ హమీద్ తన జీప్‌తో పాకిస్తాన్ ఎప్పటికీ నాశనం చేయలేని ఆ ట్యాంకులను పేల్చివేశాడు. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
పీఎన్‌ఎస్ ఘాజీ
అలాగే డిసెంబర్ 1971లో భారత్, పాక్ మధ్య యుద్ధం ప్రకటించారు. రెండు దేశాలకు చెందిన సైన్యం ముఖాముఖి నిలబడ్డాయి. ఈ యుద్ధం కేవలం ఆకాశం, భూమిలోనే కాకుండా సముద్రంలో కూడా జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ వద్ద అమెరికా లీజుకు ఇచ్చిన అత్యాధునిక జలాంతర్గామి పీఎన్‌ఎస్ ఘాజీ ఉంది. ఇది పాకిస్తాన్ ఏకైక లాంగ్ రేంజ్ జలాంతర్గామి. దీనిని నాశనం చేయడానికి భారత విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పంపారు. అయితే తరువాత ఘాజీని మోసగించడానికి భారత నావికాదళం తన పాత ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్‌ను సముద్రంలోకి పంపింది. ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ ద్వారా సముద్రం లోపల చేసిన దాడితో పాకిస్తాన్ అత్యంత ఆధునిక జలాంతర్గామి శాశ్వతంగా నీటిలో కలిసిపోయింది. ఇందులో పాకిస్తాన్ 93 మంది సైనిక అధికారులు మరణించారు.
ఎఫ్-16
1970ల నాటి భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 డాగ్ ఫైట్‌లో పాకిస్తాన్ ఎఫ్-16ను కూల్చివేసింది. అమెరికా పాకిస్తాన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్లను ఇచ్చింది. కానీ అది దానిని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించింది. వింగ్ కమాండర్ అభినందన్ మూడవ తరం మిగ్ 21తో నాల్గవ తరం విమానం ఎఫ్-16ను కూల్చివేశాడు.
