Begin typing your search above and press return to search.

బ్రిటన్ తో అగ్రిమెంట్...భారత్ కి ఎంత లాభం ?

తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన బ్రిటన్ పర్యటనలో కీలక ఒప్పందలౌ కుదిరాయ్హి.

By:  Tupaki Desk   |   25 July 2025 11:22 PM IST
బ్రిటన్ తో అగ్రిమెంట్...భారత్ కి ఎంత లాభం ?
X

భారత్ ఇపుడు ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. తాజా గణాంకాల ప్రకారం మూడవ ఆర్ధిక వ్యవస్థగా నిలిచింది. 2021 దాకా బ్రిటన్ వెనక స్థానంలో ఉన్న భారత్ ఆ తరువాత భారత్ ఆ దేశాన్ని వెనక్కి నెట్టేసింది.

దాంతో ఇపుడు బ్రిటన్ వంటి దేశాలు సైతం భారత్ తో కొత్త ఒప్పందాలకు ఆసక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇక గడచిన మూడేళ్ళలో భారత్ బ్రిటన్‌ దేశాల మధ్య ఒప్పందాల కోసం ఏకంగా 14 రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. ఇంతటి సుదీర్ఘమైన చర్చల అనంతరం కుదిరిన ఈ చర్చలు రెండు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి కొత్త బాటలు వేశాయి.

తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన బ్రిటన్ పర్యటనలో కీలక ఒప్పందలౌ కుదిరాయ్హి. దీంతో భారత్ బ్రిటన్ ల మధ్యన భాగస్వామ్యంలో సరికొత్త కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు దేశాలు విజన్‌-2035 లక్ష్యంగా సాగుతున్నాయని కూడా ప్రధాని తెలిపారు.

చాలా ఏళ్ల కృషి తర్వాత భారత్-బ్రిటన్‌ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగడం సంతోషకరమన్నారు. ఏఇ, సైబర్‌ సెక్యూరిటీ అంశాలలో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతామని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా ఇరుదేశాల సేవా రంగం ఆర్థిక, సాంకేతిక రంగాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అలాగే సులభతర వాణిజ్య విధానానికి మరింత ఊతం వచ్చిందని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉపాధి కల్పన అవకాశాలు మరింత విస్తృతం అవుతాయని నరేంద్ర మోడీ పేర్కొనడం విశేషం.

ఇక ఈ ఒప్పందం వల్ల భారత్ కి ప్రత్యేకంగా కలిగే లాభమేమిటి అంటే చాలానే అన్న జవాబు వినవస్తోంది. అయితే ఈ కీలక ఒప్పందం వల్ల భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఇక మీదట పూర్తి ప్రోత్సాహం దక్కుతుంది. మరీ ముఖ్యంగా చూస్తే కనుక భారత్‌లోని చిన్న సన్నకారు రైతులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

అంతే కాదు చాలా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ నుంచి పన్నుల బాధ లేకుండా ఉంటుంది. అలాగే భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను బ్రిటన్ కి ఎగుమతి చేసేందుకు మంచి అవకాశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మెరుగైన రేట్లు దక్కుతాయని భావిస్తున్నారు. అదే విధంగా నాణ్యతతో పాటు నిల్వ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలను పండించే అన్నదాతలకు ఈ ఒప్పందం వల్ల పూర్తిగా లాభాలే అని అంటున్నారు.

అలాగే రసాయనాలు, క్రిమి సంహారకాలు లేకుండా సంప్రదాయ పద్ధతులతో పండించే పంటలకు బ్రిటన్ మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తాయని అంటున్నారు. ఈ విధంగా చక్కని అవకాశాన్ని భారతీయ రైతులు, ఎగుమతిదారులు అందుకోబోతున్నారు అని అంటున్నారు. భారత్ బ్రిటన్ ల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పసుపు, మిరియాలు, యాలకులు, మామిడి గుజ్జు, పచ్చళ్లు, పప్పులు వంటి వాటిపై ఇక నుంచి యూకే సుంకాలు విధింపు ఉండదు. అందువల్ల రంగాలలో పెద్ద ఎత్తున ఎగుమతులను పెంచుకొని లాభాల పంట పండించుకునే అవకాశం దక్కుతుంది.

ఇలా ఒకటీ రెండూ కాదు భారత్‌కు చెందిన దాదాపు 95 శాతానికి పైగా వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి సుంకాన్ని యూకే విధించదని తెలుస్తోంది. ఎటువంటి ఎగుమతి సుంకాలు లేకపోవడంతో, వీటిని యూకేకు ఎగుమతి చేసే ఖర్చు బాగా తగ్గిపోతుంది. ఫలితంగా వీలైనంత తక్కువ రేటుకే వాటిని యూకే మార్కెట్‌లో విక్రయించే అవకాశం కలుగుతుంది. తద్వారా యూకే వ్యాపారులు, రిటైల్ వ్యాపారుల నుంచి భారత్‌కు ఆర్డర్లు బాగా రానున్నాయి.

దీని వల్ల భారత్‌లో వ్యవసాయ రంగానికి అతి పెద్ద అండ దొరుకుతుది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఎంతోమందికి కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని భావిస్తున్నారు. బ్రిటన్ కి కూడా ఈ ఒప్పందం వల్ల లాభం ఉంది. అక్కడ కార్లు ఇతర ఉత్పత్తులకు కూడా భారత్ పెద్దగా పన్నులు విధించడం లేదు. బ్రిటన్ లో హెల్త్ కేర్ సహా ఇతర రంగాలలో భారత్‌ పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం వల్ల భారత్ కే ఎంతో మేలు అని అంటున్నారు.