Begin typing your search above and press return to search.

తాజా రిపోర్టు: ఆసియాలో టాప్ 10 టెక్ సిటీస్ లో హైదరాబాద్.. ఏ స్థానమంటే?

టెక్ టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న భారతదేశ సామర్థ్యం మరోసారి నిరూపితమైంది.

By:  Tupaki Desk   |   11 July 2025 12:00 PM IST
తాజా రిపోర్టు: ఆసియాలో టాప్ 10 టెక్ సిటీస్ లో హైదరాబాద్.. ఏ స్థానమంటే?
X

టెక్ టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న భారతదేశ సామర్థ్యం మరోసారి నిరూపితమైంది. తాజాగా జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. టెక్ నిపుణుల లభ్యత ఎక్కువగా ఉన్న నగరాలు అత్యధికంగా భారత్ లోనే ఉండటం విశేషం. ఆసియా పసిఫిక్ లోని 10 అగ్రగామి నగరాల్లో ఆరు భారత్ లోనివే కావటం విశేషం. ఈ విషయాన్ని కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ 2025 రిపోర్టు వెల్లడించింది.

ఈ రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం భారతదేశంలోని ఆరు నగరాల్లో

- బెంగళూరు

- హైదరాబాద్

- ఢిల్లీ - ఎన్ సీఆర్

- ముంబయి

- ఫుణె

- చెన్నై

టాప్ 10 నగరాల్లో ఆసియా పసిఫిక్ దేశాలకు సంబంధించి టాప్ 5లో సింగపూర్ మినహా మిగిలిన నాలుగు నగరాలు భారతదేశానికి చెందిన నగరాలే. టాప్ 10లో భారత్ లోని నగరాలు కాకుండా తైపీ.. సిడ్నీ.. మెల్ బోర్న్ నగరాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసినా టెక్ నిపుణుల లభ్యత భారతదేశంలోనే అధికంగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. నిపుణులకు అవకాశాలు.. వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కార్మిక సూచీ.. అందుబాటులోకి వచ్చే నిపుణులు.. భిన్న రంగాలకు అవసరమైన నిపుణుల లభ్యత లాంటి అంశాల్లో అంతర్జాతీయంగా 200 మార్కెట్లను విశ్లేషించి.. ఈ రిపోర్టును తయారు చేసినట్లుగా సదరు సంస్థ చెబుతోంది.

ఆసియా పసిఫిక్ దేశాల్లోని టెక్ నిపుణుల్లో 69 శాతం మంది భారత నగరాల్లోనే ఉన్నట్లుగా పేర్కొన్న రిపోర్టు.. ప్రపంచ అగ్రగామి టాప్ 10టెక్ నిపుణుల కేంద్రాల్లో బెంగళూరు.. బీజింగ్.. టోక్యో నగరాలు నిలిచాయి. అత్యంత కీలక నైపుణ్యాలు.. ఐటీకి అవసరమైన మౌలిక వసతులు.. గ్రేడ్ ఏ కార్యాలయాల స్థలాలు.. తక్కువ నిర్వహణ.. నిపుణుల వ్యయాలు లాంటివి టెక్నాలజీ రంగంలో భారతదేశం ప్రపంచానికే ఆకర్షణీయ కేంద్రంగా మారుతున్నట్లు పేర్కొన్నారు. డేటా సైంటిస్టుల లభ్యతలో బెంగళూరు నగరం ముందుంది. పాతికేళ్ల లోపు సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉన్న విషయాన్ని రిపోర్టు వెల్లడించింది.