Begin typing your search above and press return to search.

పాక్ రెచ్చిపోతే చచ్చిపోయేలా చేసే ప్లాన్ లో భారత్ !

తొలి దెబ్బ కొట్టడం ఒక వీరత్వమే. అది కాసుకుని ఎంతటి బలహీనుడు అయినా మలి దెబ్బ కొడతాడు.

By:  Tupaki Desk   |   8 May 2025 8:54 AM IST
India Bold Strike In Terrorists
X

తొలి దెబ్బ కొట్టడం ఒక వీరత్వమే. అది కాసుకుని ఎంతటి బలహీనుడు అయినా మలి దెబ్బ కొడతాడు. అపుడు డిఫెన్స్ లో ఉండి కూడా శత్రువు పీచమణచాలి. అలా చేస్తేనే డబుల్ విక్టరీ దక్కుతుంది. పాక్ అన్నది ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ ఆ ఉన్మాదంలో మునిగితేలుతున్న దేశం కాని దేశం. బయట ప్రపంచానికి పాక్ ఒక దేశంగా కనిపించవచ్చు. ఆ విధంగా గత డెబ్బై అయిదేళ్ళుగా ఎంతలా నాటకాలు ఆడాలో అన్నీ ఆడుతూ వంచిస్తున్న పాక్ భారత్ ని ఈ విధంగా ముప్పతిప్పలు పెట్టింది.

పాక్ సంగతి అమెరికాకు అర్ధం అయింది పాతికేళ్ళ క్రితమే. తమ దేశంలో దాడి చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కుప్ప కూల్చిన తరువాత పాక్ లో ఉన్నది ఉగ్ర పాములు వాటికి పాలు పోస్తున్నది ఆ దేశమే అని అర్ధం అయింది. నాటి నుంచి కొంత ఆలోచనలో పడినా కూడా అమెరికా భారత్ తో పాటు పాక్ ని శక్తివంతమైన దేశమే అని అంటుంది. ఇవన్నీ అంతర్జాతీయ సమాజం అవసరాలకు తగినట్లుగా చేసే విన్యాసాలు. ఇవే పాక్ కి అందుకొస్తున్న అవకాశాలు.

ఇవన్నీ పక్కన పెడితే పాక్ కి చైనా మద్దతు ఉంది. పాక్ లో ఉన్న అంతర్జాతీయ ఉగ్ర వాదులు వారి విషయాల గురించి భారత్ అంతర్జాతీయ వేదిక మీద ఎంతలా గొంతు చించుకున్నా కూడా చైనా అడ్డుకుని పాక్ ని కాపాడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇపుడు చూస్తే పాక్ లో తొమ్మిది చోట్ల భారత్ దాడులు చేసి ఉగ్ర శిబిరాలను ద్వంశం చేసింది.

అయితే ఇది సంబరమే. భారత్ ఆనందించదగిన విషయమే. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు. ఏమీ చేయకపోయినా భారత్ కి కెలికి నష్టపరచి ఆనందిచే పాక్ కి ఈ మూతి పగిలే దెబ్బ మరింతగా పెచ్చెక్కిస్తుంది అన్నది వాస్తవం. దాంతో పాక్ తన పరువుని కూడా కాపాడుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో అది ప్రతీకార దాడులకు దిగుతుంది.

ఈ విషయం భారత్ కి కూడా తెలుసు. అందుకే భారత్ తెలివిగా పాక్ లోని ఉగ్ర తండాలనే లక్ష్యంగా చేసుకుంది ఇపుడు పాక్ భారత్ లోని సున్నిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఏమైనా ఎటాక్ చేస్తుందా అన్నదే చర్చగా ఉంది. సముద్ర తీర ప్రాంతాలు కీలక స్థావరాలు ఉన్న ప్రాంతాలను పాక్ టార్గెట్ గా చేసుకుంటుందని భారత రక్షణ శాఖ అంచనా వేస్తోంది. దాంతో పాటు పాక్ భారత్ సరిహద్దు రాష్ట్రాల మీద కూడా నిఘా పెంచుతోంది.

ఈ విధంగా పాక్ ప్రతీకారానికి కాలు దువ్వితే భారత్ లోనే దాని పీచమణచేందుకు కూడా కౌంటర్ ఎటాక్ ని ప్లాన్ చేసుకుని ఉంది అని అంటున్నారు. అయితే దాయాది నక్క జిత్తులది. దొంగ దెబ్బ తీయడానికే అది చూస్తుంది. ఎదురుగా వచ్చే సాహసం స్తోమత దానికి లేవు. అందువల్ల భారత్ వేయి కాదు కదా కోటి కళ్ళతో ఎక్కడికక్కడ నిఘా పెడుతోంది.

ఈ కీలక సమయంలో ప్రజలు అంతా కూడా ఐక్యంగా ఉండి భారత్ కి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. దాయాదిని దాని సొంత ఇంట్లోనే పాతరేసిన భారత్ కి అది చేసే ప్రతీకార దాడులను ఎదుర్కోవడం కష్టమేనీ కాదు. కానీ దానికి దేశంలోని ప్రజలు కూడా సహకరిస్తే సక్సెస్ ఫుల్ గా పాక్ కి గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. పాక్ ప్రతీకారం కనుక వీగిపోతే కనుక దానికి ఇక తోక ముడవడం తప్పించి గత్యంతరం లేదు. అందుకే కేంద్రం ఇపుడు పాక్ వేసే అడుగులు దాని ఆలోచనల మీదనే ఫుల్ ఫోకస్ పెట్టి అలెర్ట్ గా ఉంది.