శత్రువు గుండెల్లో రైళ్లు.. మన సైనికుల సత్తాకు పాక్ యూత్ కూడా సెల్యూట్ అంటోంది
ఈ ఆపరేషన్‌ను పాకిస్తాన్ యూత్ కూడా మెచ్చుకుంటుంటే.. ఇంక మనకెంత కిక్కుంటుందో చెప్పక్కర్లేదు కదా.
By: Tupaki Desk | 8 May 2025 3:00 PM ISTమన దెబ్బకు పాకిస్తాన్ షేక్ అయిపోతుంది. పహల్గాంలో మనవాళ్లపై దాడి చేసిన ఉగ్రవాదులకు మన సైన్యం గట్టిగా ఇచ్చింది. ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి చేసి వాళ్లను చితక్కొట్టింది. ఈ ఆపరేషన్‌ను పాకిస్తాన్ యూత్ కూడా మెచ్చుకుంటుంటే.. ఇంక మనకెంత కిక్కుంటుందో చెప్పక్కర్లేదు కదా.
పహల్గాంలో అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రవాదులకు మన ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలపై పిడుగులా దాడి చేసి వాళ్లను మట్టికరిపించింది. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి పెద్ద ఉగ్రసంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వాళ్ల ట్రైనింగ్ క్యాంపులన్నీ నేలమట్టం అయ్యాయి. బహవాల్‌పూర్ దగ్గర నాలుగు జైషే క్యాంపులు, కొట్లి, మర్కజ్ సుభాన్ అల్లా, మర్కజ్ తైబా లాంటి చాలా చోట్ల ఉన్న ఉగ్ర స్థావరాలను మనోళ్లు తుక్కుతుక్కు చేశారు.
ఈ దెబ్బకు పాకిస్తాన్ యూత్ షాక్ అయిపోయారు. మన ఆర్మీ చేసిన పనికి ఫిదా అయిపోయి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చీకట్లో కూడా మన ఎయిర్ ఫోర్స్ కరెక్ట్‌గా టార్గెట్ కొట్టిందని మెచ్చుకుంటున్నారు. వాళ్ల ఆర్మీ మాత్రం ఏమీ చేయలేకపోయిందని తిట్టిపోస్తున్నారు.
ఒక పాకిస్తాన్ కుర్రాడు వీడియో పెట్టి.. ఇండియా 24 మిస్సైళ్లు వేస్తే వాళ్ల ఆర్మీ ఒక్కదాన్ని కూడా ఆపలేకపోయిందని చెప్పాడు. ఇది వాళ్ల డిఫెన్స్ సిస్టమ్ ఎంత వీక్‌గా ఉందో చూపిస్తోందని అన్నాడు. ఉగ్రవాదుల ఇళ్లల్లోకి దూరి కొడతామని ఇండియా చెప్పిందే చేసిందని మెచ్చుకున్నాడు. ఇజ్రాయెల్ లాగా మన ఆర్మీ కూడా పవర్‌ఫుల్‌గా ఉందని అన్నాడు. ఒకవేళ ఇండియా ఉగ్ర క్యాంపుల బదులు సిటీల మీద దాడి చేసి ఉంటే చాలా మంది చనిపోయేవారని కూడా చెప్పాడు. పాకిస్తాన్ మీడియా మాత్రం తప్పుడు వార్తలు చెప్తోందని విమర్శించాడు.
మరో కుర్రాడు పెషావర్ ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్‌గా ఉందని, ఇస్లామాబాద్ ఫ్లైట్‌ను ఇటువైపు మళ్లించారని చెప్పాడు. అక్కడ అంతా భయంగా ఉందని, కానీ పాకిస్తాన్ అధికారులు మాత్రం అంతా బాగానే ఉందని అబద్ధాలు చెప్తున్నారని అన్నాడు.
