పాక్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్.. బాగ్‌లిహార్ డ్యామ్ నీళ్లు బంద్
పహల్గామ్‌లో టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత పాకిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి భారత్ గట్టిగా బిగిస్తోంది.
By: Tupaki Desk | 4 May 2025 1:25 PM ISTపహల్గామ్‌లో టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత పాకిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి భారత్ గట్టిగా బిగిస్తోంది. ఇదివరకే సింధు నదుల ఒప్పందానికి బ్రేక్ వేసిన ఢిల్లీ పెద్దలు, తాజాగా బాగ్‌లిహార్ డ్యామ్ నుంచి పాక్‌కు పోయే నీళ్లను కూడా ఆపేశారు. దాయాది దేశాన్ని ఇబ్బంది పెట్టే పనుల్లో ఇది రెండోదని అనుకుంటున్నారు. పాకిస్తాన్ శనివారం నేల మీద నుంచి నేల మీదకు పేల్చే రాకెట్‌ను టెస్ట్ చేసిన టైమ్‌లోనే ఈ విషయం బయటికి రావడం విశేషం.
నీళ్ల ప్రవాహం ఆగడానికి ఆ డ్యామ్ గేట్లను పూర్తిగా కిందకు దించేశారు. దీంతో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి ఇక్కడి నుంచి నీళ్ల సరఫరా బంద్ అయింది. ఇది కొద్ది రోజులే ఉంటుందని అక్కడి పెద్దాయన ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు. అవసరమైతే భారత్ గట్టి చర్యలు తీసుకుంటదని పాక్‌కు అర్థమయ్యేలా చెప్పినట్టేనని ఆయన అన్నారు.
900 మెగావాట్ల కరెంటు కోసం ఈ డ్యామ్‌ను చీనాబ్ నది మీద 2008లో కట్టారు. ఈ డ్యామ్ దాదాపు 145 మీటర్ల పొడవు ఉంటది. సింధు నదుల ఒప్పందం ప్రకారం పాక్‌కు ఎక్కువ నీళ్లు వచ్చే నదుల్లో చీనాబ్ కూడా ఒకటి. పంజాబ్ రాష్ట్రంలో చాలా పంటలు దీని మీదే ఆధారపడి ఉంటాయి.
టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత ఏప్రిల్ 26న సింధు నదుల ఒప్పందాన్ని భారత్ ఆపేసింది. ఆ తర్వాత 29కే ఈ డ్యామ్ నుంచి పాకిస్తాన్‌కు పోయే నీళ్లు ఆగిపోయాయని శాటిలైట్ ఫొటోలు బయటపెట్టాయి. పాక్‌లోని సియాల్‌కోట్ దగ్గరికి వచ్చేసరికి చీనాబ్ నది మొత్తం ఎండిపోయింది. పాక్‌లోని పంజాబ్‌లో పత్తి, వరి పండించడానికి ఈ నీళ్లు చాలా ముఖ్యం.
ఇక గత వారం జీలం నది వరద పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ దగ్గర పోయిన వారం జీలం నదిలో నీళ్ల మట్టం ఒక్కసారిగా చాలా అడుగులు పెరిగిపోయింది. దీంతో అక్కడి అధికారులు హట్టియాన్ బాలా అనే ఏరియాలో ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. ముజఫరాబాద్‌కు ఇది 40 కిలోమీటర్ల దూరం ఉంటది. ప్రజలను నది దగ్గరికి రావొద్దని మసీదుల నుంచి అనౌన్స్ చేశారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా పోయి చకోథి ఏరియాలో పీవోకేలోకి వెళ్తుంది.
