భారత్-పాక్ యుద్ధ భయం: 7.5 లక్షల కోట్లు ఆవిరి!
భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి కూడా.. మార్కెట్ పతనం దిశగా దూసుకుపోయింది.
By: Tupaki Desk | 25 April 2025 3:14 PM ISTభారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి కూడా.. మార్కెట్ పతనం దిశగా దూసుకుపోయింది. దీనికి ప్రధాన కారణం.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందన్న భయమేనని తెలుస్తోంది. మార్కెట్ వర్గాలు కూడా.. ఇదే విషయాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి.. యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పహిల్గామ్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం.. పాకిస్థాన్ విషయంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ క్రమంలోనే కీలకమైన సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇది పాకిస్థాన్‌కు ప్రాణాధారమైన ప్రాజెక్టు కావడంతో ఆదేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అదేవిధంగా వీసాల రద్దు.. పాకిస్థాన్ పౌరులను తక్షణమే భారత్ నుంచి పంపేయడం వంటివి కూడా.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచా యి. ఈ నేపథ్యానికి తోడు.. బోర్డర్‌లో పాకిస్థాన్ దళాలు.. భారత సైనికులపై కాల్పులు జరిపాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు కుదేలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.
శుక్రవారంఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మేరకు నష్టపోయాయి. ఉదయం 11 గంటల వరకు ఈ తిరోగమనం కొనసాగుతూనే ఉంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 7.5 లక్షల కోట్ల రూపాయలు ఆవి రైనట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అదే విధంగా కీలక బ్యాంకు లు ఎస్ బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కూడా.. నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఫలితం పెట్టుబడులు పెట్టేవారు.. లేక.. వచ్చిందే చాలన్నట్టుగా.. లాభాలు తీసేసుకోవడంతోనే ఈపరిస్థితి వచ్చినట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని తెలిపారు.
