1.65 లక్షల భారతీయ వీసా అప్లికేషన్స్ రిజెక్ట్.. వారికి రూ.1410 కోట్ల ఆదాయం!
షెంజెన్ కంట్రీస్ లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్ వీసా అప్లికేషన్స్ గత ఏడాది లక్షల్లో తిరస్కరణకు గురయ్యాయి. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి.
By: Tupaki Desk | 24 May 2025 4:00 PM ISTతాజాగా షెంజెన్ వీసాల తిరస్కరణకు సంబంధించిన కీలక విషయం తెరపైకి వచ్చింది. ఈ మేరకు యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో.. ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్ వీసా ధరఖాస్తుల్లో గతేడాది లక్షలాది సంఖ్యలో తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. ఈ రిజెక్ట్ అయిన వీసాల్లో భారత్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
అవును... షెంజెన్ కంట్రీస్ లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్ వీసా అప్లికేషన్స్ గత ఏడాది లక్షల్లో తిరస్కరణకు గురయ్యాయి. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇందులో భాగంగా.. భారత్ నుంచి వచ్చిన ధరఖాస్తుల్లో 1.65 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్ అవ్వగా.. తద్వారా సుమారు రూ.136 కోట్లు కోల్పోయారు.
వాస్తవానికి.. షెంజెన్ సభ్యదేశాలకు గత ఏడాది భారీ సంఖ్యలో వీసా దరఖాస్తులు రాగా.. అందులో ఏకంగా 17 లక్షల అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ దరఖాస్తు రుసుములతో రూ.1,410 కోట్లు ఆదాయం వచ్చినట్లు అంచనా. ఈ క్రమంలోనే భారత్ నుంచి 11.08 లక్షల దరఖాస్తులు రాగా.. వాటిలో ఏకంగా 1.65 లక్షల అప్లికేషన్లు రిజక్ట్ అయ్యాయి.
ఇలా అత్యధిక సంఖ్యలో భారతీయుల వీసా అప్లికేషన్లు తిరస్కరించిన దేశాల్లో 31 వేల అప్లికేషన్స్ తో ఫ్రాన్స్ ముందుండగా.. తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్ (26,000), జర్మనీ (15,000), స్పెయిన్ (15,000), నెదర్లాండ్స్ (14,500) కూడా భారీ సంఖ్యలో భారతీయుల వీసాలను తిరస్కరించిన దేశాల్లో ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ దేశాలే భారీ సంఖ్యలో వీసాలు జారీ చేశాయి!
ఇక అత్యధికంగా షెంజైన్ వీసా తిరస్కరణకు గురైన దేశాల జాబితాను పరిశీలిస్తే...
1. అల్జీరియా - 1,85,101
2. తుర్కియే - 1,70,129
3. భారత్ - 1,65,266
4. మొరాకో - 1,15,774
5. తుర్కియే - 1,70,129 మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి!
కాగా.. షెంజైన్ అంటే 29 ఐరోపా దేశాల సమాఖ్య అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయా దేశాల్లో 90 రోజుల వరకూ పర్యటించేందుకు వీలుగా షెంజైన్ వీసాలను జారీ చేస్తుంటారు. ఏదైనా షెంజెన్ దేశం ఈ వీసాను జారీ చేస్తే... దానితో ఇతర షెంజెన్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి లభిస్తుంది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, బల్గేరియా, డెన్మార్క్ మొదలైన దేశాలు ఈ పరిధిలోకి వస్తాయి!
