Begin typing your search above and press return to search.

ఏఐ దెబ్బకు ఉద్యోగాలు ఖతం.. శాలరీ వ్యవస్థ ఇక కనుమరుగేనా?

AI టెక్నాలజీ : AI టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది.ఇది మానవుల కంటే వేగంగా, అన్ని పనులను కచ్చితత్వంతో చేయగలదు

By:  Tupaki Desk   |   21 April 2025 3:00 PM IST
Is the Traditional Salary System Dying in India?
X

భారతదేశంలో కొన్నేళ్లుగా మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక వెన్నుదన్నుగా ఉన్న శాలరీ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోందనే భయంకరమైన వాస్తవాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త సౌరభ్ ముఖర్జియా ఇటీవల వెల్లడించారు. ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. "భారత్ ఇప్పుడు ఒక నూతన ఆర్థిక శకంలోకి అడుగుపెట్టబోతుంది. రాబోయే రోజుల్లో ఉాద్యోగులు కేవలం జీతం కోసం కాకుండా వారికి లభించే ఇతర ప్రయోజనాల మేరకు మాత్రమే పని చేసే పరిస్థితి రావొచ్చు. కేవలం డిగ్రీలు, చదువు ఒక్కటే భవిష్యత్ కు భరోసా ఇవ్వలేవు. వందల మంది కలిసి చేసే పని ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సౌరభ్ ముఖర్జియా అభిప్రాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు శాలరీ వ్యవస్థ అంతరించిపోవడానికి గల కారణాలేంటి.. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

సౌరభ్ ముఖర్జియా ఈ అభిప్రాయానికి రావడానికి గల కారణాలు..

AI టెక్నాలజీ : AI టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది.ఇది మానవుల కంటే వేగంగా, అన్ని పనులను కచ్చితత్వంతో చేయగలదు. దీని వల్ల డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, అకౌంటింగ్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు AI మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

గిగ్ ఎకానమీ (Gig Economy) పెరుగుదల: గిగ్ ఎకానమీలో ఉద్యోగులు ఓ నిర్థిష్ట ప్రాజెక్ట్ కోసం స్వతంత్ర్యంగా పని చేస్తారు. వారికి నెలవారీ జీతం ఉండదు. ఫ్రీలాన్సింగ్, కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు పెరుగుతుండడంతో నెలవారీ జీతం తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది.

ఉద్యోగాల స్వభావంలో మార్పులు : ఇప్పుడు చాలా కంపెనీలు మల్టి టాలెంటెడ్ ఉద్యోగులను మాత్రమే కోరుకుంటున్నాయి. ఒకే రకమైన పని చేసే వందలాది మంది ఉద్యోగులకు బదులుగా.. తక్కువ సంఖ్యలో మల్టీ-టాస్కింగ్ చేయగల నిపుణులను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

ప్రయోజనాల మీద దృష్టి : కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆకర్షించేందుకు జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్(స్టాక్ ఆప్షన్స్, బోనస్‌లు, పనిలో సౌలభ్యం, ట్రైనింగ్ అవకాశాలు) అందించడానికి సిద్ధంగా ఉంటున్నాయి. ఉద్యోగులు కూడా కేవలం జీతం కాకుండా తమ కెరీర్ కు ఉపయోగపడే విధంగా అందుకు దోహద పడే ప్రయోజనాలను కోరుకుంటున్నారు.

సౌరభ్ ముఖర్జియా అభిప్రాయంతో చాలా మంది నిపుణుల ఏకీభవిస్తున్నారు. AIరాకతో ఉద్యోగాల స్వరూపం మారుతుందని అంటున్నారు. ఉద్యోగులు తమను తాము కొత్త పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే, కొందరు నిపుణులు పూర్తిగా శాలరీ వ్యవస్థ అంతరించిపోతుందని చెప్పడం లేదన్నారు.