ఎస్-400 భారత్ కు రావడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా?
భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారాయి.. శనివారం సాయత్రం 5 గంటల తర్వాత చీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి.
By: Tupaki Desk | 12 May 2025 2:59 PM ISTభారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారాయి.. శనివారం సాయత్రం 5 గంటల తర్వాత చీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే.. ఈ యుద్ధంలో ప్రధాని మోడీ చెప్పినట్లు ఒక్క రౌండ్ లో కూడా పాకిస్థాన్ గెలవలేదు. ఆ విధంగా పాకిస్థాన్ ను ముప్పుతిప్పలు పెట్టిన భారత్ కున్న బలాల్లో అత్యంత కీలకమైనది భారత సుదర్శన్ చక్రం ఎస్-400!
అవును... సాధారణం మిలటరీ జనాలకు తప్ప యుద్ధంలో వాడే ఆయుధాల గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా అంటూ భారత్ పై పాక్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగించినప్పుడు ఒక్క క్షిపణి కూడా భారత భూభాగాన్ని గాయపరిచే అవకాశం కల్పించకుండా అడ్డుకుంది ఎస్-400.
భారత గగనతల రక్షణ వ్యవస్థలోకి ఈ ఎస్-400 అంత ఈజీగా ఏమీ రాలేదు. దీని ధర చాలా ఎక్కువనే సంగతి పక్కనపెడితే... రష్యా నుంచి ఈ వ్యవస్థను కొనుగోలు చేసే విషయంలో అగ్రరాజ్యం అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురయ్యాయి. రష్యా చేసిన ఈ రక్షణ వ్యవస్థ.. అమెరికా ప్రయోగించే క్షిపణులను సైతం అడ్డుకోగలగడంతో.. అగ్రరాజ్యానికి కన్నుకుట్టిందని అంటారు.
అందువల్లే... భారత్ తోపాటు పలు ప్రపంచ దేశాలకు అమెరికా ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్-400 ను కొనుగోలు చేయొద్దని చెప్పింది. ఈ వ్యవస్థను కొనుగోలు చేస్తే ఆంక్షలు తప్పవంటూ తనదైన శైలిలో బ్లాక్ మెయిల్ కు దిగింది. అయితే ఈ హెచ్చరికలను భారత్ ఖాతరు చేయలేదు. అందుకు కారణం నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అని అంటారు.
ఈ స్థాయి వ్యవస్థ భారత్ కు రావడంలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాత్ర కీలకం అని చెబుతారు. నాడు ఈ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ కు అవసరమని ప్రధాని మోడీకి పారికర్ నొక్కి చెప్పారని అంటారు. ఈ నేపథ్యంలోనే రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. తమకు ఐదు ఎస్-400 లు కొనుగోలు చేయలని ఫిక్సయ్యారు.
వీటికోసం భారత్ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం! అయితే... అంతకు మించి అన్నట్లుగా ఈ వ్యవస్థ భారత్ కు న్యాయం చేసింది. గురువారం ఉదయం భారత్ లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ లను.. రాత్రి జమ్మూ లక్ష్యంగా మరిన్ని డ్రోన్లు, మిస్సైళ్లు, ఫైటర్ జెట్ లను పాక్ వదిలినప్పుడు ఇదే కాపాడింది!
పదుల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను గాల్లోనే నాశనం చేసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎస్-400 నిర్వీర్యం చేసిన శత్రు ఆయుధాల్లో... టర్కీష్ డ్రోన్లు, చైనా క్షిపణులు కూడా ఉన్నట్లు కేంద్రం చెప్పింది! దీంతో... ఆ రెండు దేశాలకు కూడా భారత గగనతల రక్షణ వ్యవస్థపై ఒక క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు.
డ్రోన్లు, యుద్ధవిమానాలు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో ఇది నేలకూల్చగలదనే విషయంపై క్లారిటీ వచ్చింది! గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ భారత్ పై పాక్ సుమారు 50 డ్రోన్లు, 8 మిస్సైళ్లు, 3 ఫైటర్ జెట్ లను ప్రయోగించగా.. వాటన్నింటినీ సమర్ధవంతంగా నాశనం చేయడంలో ఈ ఎస్-400 పాత్ర అత్యంత కీలకం.
ఈ విధీంగా అమెరికా ఆంక్షలు విధించినా.. పారికర్ పట్టుదలతో.. మోడీ ముందుకు కదలండతో 2018లో భారత్ అంబుల పొదిలో ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 వచ్చి చేరింది. ప్రస్తుతం భారత్ వద్ద ఇలాంటివి మూడు ఉండగా.. మరో రెండు వచ్చే ఏడాది ఆగస్టులో రావొచ్చని అంటున్నారు.
