Begin typing your search above and press return to search.

పాకిస్తానీలకు భారత్ ఎన్ని రకాల వీసాలు ఇచ్చేది? వాటిలో పవర్ఫుల్ వీసా ఏది?

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తో సార్క్ వీసాను తక్షణమే రద్దు చేసింది.

By:  Tupaki Desk   |   28 April 2025 1:00 PM IST
India Revokes All Pakistani Visas Post-Pahalgam Attack
X

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తో సార్క్ వీసాను తక్షణమే రద్దు చేసింది. మెడికల్ వీసా ఉన్నవారు మినహా ఏప్రిల్ 27 వరకు భారతదేశంలో ఉన్న పాకిస్తానీయులకు ఇదే చివరి తేదీ. ఇప్పుడు పాకిస్తానీయులు భారత్ నుంచి వెళ్లకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌కు ఎన్ని రకాల వీసాలు ఇచ్చేది. వాటిలో అత్యంత పవర్ ఫుల్ వీసా ఏది అనే విషయాలను తెలుసుకుందాం.

గురువారం భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వర్గాల వారిని మినహాయించి.. మిగిలిన పాకిస్తాన్ పౌరులందరి వీసాలను ఏప్రిల్ 27నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరారు.

ఈ ఉత్తర్వులో సార్క్ వీసా, బిజినెస్ వీసా, వీసా ఆన్ అరైవల్, జర్నలిస్ట్ వీసా, మెడికల్ వీసా, ట్రాన్సిట్ వీసా, ఫిల్మ్ వీసా, పర్వతారోహణ వీసా, కాన్ఫరెన్స్ వీసా, విజిటర్ వీసా, స్టూడెంట్ వీసా, తీర్థయాత్ర వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా, పాకిస్తాన్‌లోని మైనారిటీ గ్రూప్ తీర్థయాత్ర వీసాలు వంటి మొత్తం 14 రకాల వీసాలను భారత్ పాకిస్తానీయులకు ఇచ్చేదని పేర్కొన్నారు. దేశం విడిచి వెళ్లే వారందరూ ఈ 12 వర్గాలకు చెందిన వారైతే నిర్ణీత సమయానికి భారత్ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సార్క్ వీసా ఉన్నవారికి శనివారం వరకు, మెడికల్ వీసా ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు.

ఈ అన్ని వీసాలలో సార్క్ వీసా అత్యంత పవర్ ఫుల్ గా పరిగణించబడేది. ఎందుకంటే ఈ వీసా సార్క్ దేశాలలోని సెలక్ట్ చేసిన పౌరులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తుంది. సార్క్ వీసా సాధారణంగా ఆ ప్రాంతంలో వీసా నుంచి మినహాయింపు పొందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. దీనిని 1992లో ప్రారంభించారు.