మే నెలలో రికార్డు సృష్టించిన చమురు ఎగుమతులు.. రష్యా నుంచే ఎక్కువ
రష్యా తర్వాత, భారత్‌కు ముడిచమురును సరఫరా చేస్తున్న ప్రధాన దేశాలు. ఇరాక్ రెండో స్థానంలో ఉంది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:00 AM ISTప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్. తన ఇంధన అవసరాల కోసం విదేశాల మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. ఇటీవల రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు అనూహ్యంగా పెరిగి, గత పది నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. రష్యాపై పశ్చిమ దేశాలు చాలా ఆంక్షలు విధించాయి. అయినా వాటిని తెలివిగా అధిగమిస్తూ చౌకగా చమురును పొందుతున్న భారత్ వ్యూహం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది
మే నెలలో కొత్త రికార్డు
మే నెలలో భారతదేశం రష్యా నుంచి రోజుకు 1.96 మిలియన్ బ్యారెల్స్ (bpd) ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఇది గత పది నెలల గరిష్ట స్థాయి. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇది దాదాపు 38 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. రష్యా నుంచి ప్రపంచ బెంచ్‌మార్క్ ధరలతో పోలిస్తే భారీ డిస్కౌంట్ లభించడమే దీనికి ప్రధాన కారణమని కెప్లర్ షిప్-ట్రాకింగ్ డేటా వెల్లడించింది.
రష్యా తర్వాత, భారత్‌కు ముడిచమురును సరఫరా చేస్తున్న ప్రధాన దేశాలు. ఇరాక్ రెండో స్థానంలో ఉంది. ఇది 1.2 మిలియన్ bpd (మొత్తం దిగుమతుల్లో 2వ స్థానం)ను భారత్ కు ఎగుమతి చేస్తుంది. తర్వాత సౌదీ అరేబియా - 6,15,000 bpd, యూఏఈ (UAE) - 4,90,000 bpd, అమెరికా (US) - 2,80,000 bpdలను అందిస్తుంది.
ఈ గణాంకాలు చూస్తే రష్యా భారత్ చమురు అవసరాలను తీర్చడంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టమవుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ రష్యా నుంచి లభించే తక్కువ ధరల చమురు భారతదేశానికి ఆర్థికంగా చాలా లాభదాయకంగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా చమురుపై బ్యారెల్‌కు 60 డాలర్ల ధర పరిమితిని కూడా విధించాయి. అయితే, రష్యా ఈ ఆంక్షలను అధిగమించడానికి చౌకగా చమురును విక్రయించేందుకు సిద్ధంగా ఉంది. భారతదేశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రష్యా నుంచి భారీ ఎత్తున చమురును కొనుగోలు చేస్తోంది.
