ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లీయెస్ట్ ఏజెన్సీ.. ఆ 'అజ్ఞాత వ్యక్తులు' మన RAW వాళ్లేనా?
ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనగానే అందరికీ ఇజ్రాయెల్‌కు చెందిన 'మొసాద్' గుర్తుకొస్తుంది.
By: Madhu Reddy | 22 May 2026 6:00 PM ISTప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనగానే అందరికీ ఇజ్రాయెల్‌కు చెందిన 'మొసాద్' గుర్తుకొస్తుంది. కానీ, గత ఐదేళ్లుగా జరుగుతున్న కొన్ని నమ్మలేని సంఘటనలు చూస్తుంటే.. ఇప్పుడు మన ఇండియాకు చెందిన 'రా'.. ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లీయెస్ట్ ఏజెన్సీగా మారిందా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. గడిచిన ఐదేళ్లలో 15 మందికి పైగా మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ టెర్రరిస్ట్ మాస్టర్‌మైండ్లను ఎవరో 'అజ్ఞాత వ్యక్తులు' మట్టుబెట్టారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ల వెనుక ఉంది మన దేశపు ఇంటెలిజెన్స్ ఏజెన్సీనేనా అనే ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐదేళ్లలో ఎగిరిపోయిన వికెట్లు ఇవే:
భారత్‌పై దాడులకు తెగబడిన ఎంతోమంది టెర్రరిస్ట్ లీడర్లు గత ఐదేళ్లలో వరుసగా ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి సూత్రధారి హంజా బుర్హాన్ (మే 2026), లష్కరే తోయిబాకు చెందిన షేక్ యూసుఫ్ అఫ్రిది (ఏప్రిల్ 2026), రజావుల్లా నిజామనిలతో పాటు హాఫిజ్ మహ్మద్ జమీల్, పఠాన్‌కోట్ దాడి నిందితుడు షాహిద్ లతీఫ్, ఐసీ-814 హైజాక్ నిందితుడు జాహిద్ అఖుండ్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు పాకిస్తాన్ గడ్డపైనే హతమయ్యారు.
ఎవరా అజ్ఞాత వ్యక్తులు?:
సినిమా స్టైల్‌లో టెర్రరిస్టుల ఇళ్లలోకి దూరి మరీ కాల్చి చంపేస్తున్న ఆ 'అజ్ఞాత వ్యక్తులు' ఎవరు అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. వీళ్లను ఎవరు పంపుతున్నారు? వీళ్లకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది? అనే దానికి ఎక్కడా ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం దీని వెనుక పక్కాగా ఇండియన్ 'రా' (RAW) ఏజెన్సీ హస్తం ఉందేమోనంటూ విపరీతమైన చర్చ జోరుగా నడుస్తోంది.
పాకిస్తాన్ కూడా వణికిపోతోంది:
ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్తాన్ జనాలు కూడా దీని వెనుక భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాత్రే ఉందని గట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం.తమ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న టెర్రరిస్టులు ఇలా వరుసగా చనిపోతుండటంతో పాకిస్తాన్ రక్షణ సంస్థలు కూడా షాక్‌లో ఉన్నాయట. అయితే ఇక దీనిపై ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు, కేవలం సోషల్ మీడియా టాక్ మాత్రమే.
హాలీవుడ్ రేంజ్ సినిమాలు రావడం ఖాయం:
ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం గనుక నిజమైతే.. ప్రపంచంలోనే నంబర్ వన్ సక్సెస్ రేట్ ఉన్న ఏజెన్సీగా 'రా' సరికొత్త రికార్డు సృష్టించినట్లే. ఇక మనకు హాలీవుడ్ స్పై సినిమాల్లో చూపించే మిషన్ల కంటే ఇవి చాలా పెద్దవని చెప్పాలి. ఇక భవిష్యత్తులో మన 'రా' ఆపరేషన్ల మీద 'ధురంధర్ ' లాంటి మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సినిమాలు మరిన్ని పుట్టుకురావడానికి ఇది గట్టి లైన్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
భారతదేశ సరిహద్దుల వెలుపల శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న ఆ అజ్ఞాత వీరులు ఎవరైనా కావచ్చు.. కానీ భారత్‌ను టార్గెట్ చేసిన టెర్రరిస్టులు మాత్రం వరుసగా మట్టికరుస్తున్నారు. ఇక అధికారికంగా ఎలాంటి నిజాలు బయటకు రాకపోయినా, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పవర్ ఏంటో ప్రపంచానికి చూపించడానికి ఈ అంచనాలు, చర్చలు చాలు. ఏది ఏమైనా, దేశ రక్షణ విషయంలో మనవాళ్లు తీసుకుంటున్న స్టెప్స్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారాయి..
