భారత్ జనాభా పరుగులు...ఎన్ని కోట్లంటే ?
ప్రతీ ఏటా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో జనాభా గణన విభాగం ఉంది.
By: Satya P | 11 July 2026 8:00 AM ISTమనది సౌభాగ్య దేశం, సంతాన దేశం. భారత్ లో జనాభా అధికం. అంతే కాదు ఇపుడు ప్రపంచంలోనే మనం ఈ విషయంలో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాం. చైనా ఒకపుడు అగ్ర స్థానంలో ఉండేది. ఆ స్థానాన్ని మనం చాలా వేగంగానే దొరకబుచ్చుకున్నాం. చైనా మన వెనక్కి బాగా నెట్టబడింది. ఇది మనకు లాభమా నష్టమా అన్న లెక్క తీసి పక్కన పెడితే మనం ఈ రోజున అతి పెద్ద జనాభా దేశంగా ప్రపంచంలో ఉన్నాం. మొత్తం ప్రపంచ జనాభా 190 కి పైగా దేశాలతో కలిపి 800 కోట్ల పైచిలుకు ఉంటే అందులో ఒక్క భారత్ 18 శాతం దాకా ఉన్నాం. ఇది ఒక విధంగా గొప్పదే. కానీ మరో విధంగా చూస్తే ఇంత పెద్ద జనాభాతో ఈ ఏఐ యుగంలో భారత్ ఉపాధికి చేసే పోరాటంలో తట్టుకుని ఏ విధంగా ముందుకు సాగగలదు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.
అక్షరాలా అన్ని కోట్లు :
ఇదిలా ఉంటే ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11న నిర్వహిస్తున్నారు. మరి భారత్ చూస్తే 2026 జూలై 10 నాటికి దేశ జనాభా లెక్క వేస్తే కచ్చితంగా ఒక 157 కోట్ల ఒక లక్షా 73 వేల 556 వేల మంది అని తేలింది. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ జనాభా లెక్క కూడా చొస్తే అయిదు కోట్ల 91 లక్షల 49 వేల 521గా లెక్కించారు. మరో ఎనిమిదిన్నర లక్షలకు కూడితే ఏపీ జనాభా కచ్చితంగా ఆరు కోట్లకు చేరుకుంటుంది అన్న మాట. అలాగే మరి కొద్ది కాలంలోనే దేశ జనాభా కూడా 150 కోట్లకు చేరువ అవుతుందని కూడా ప్రస్తుత గణాంకాలు సూచిస్తున్నాయి.
అక్కడ పెద్ద బోర్డుతో :
ప్రతీ ఏటా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో జనాభా గణన విభాగం ఉంది. అక్కడ ప్రతీ రోజూ దేశ జనాభా ఎంత అన్నది లెక్కించి పెద్ద బోర్డుపైన పెడతారు. ప్రపంచ జనాభా దినోత్సవం వేళ దేశ జనాభా ఎంత అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. దాంతో 147, 01, 73, 556 అని అందరికీ కనిపించేలా బోర్డు పెట్టారు. దాంతో అంతా భారత్ జనాభా అంత ఎక్కువా అని చర్చించుకుంటున్నారు. భారత్ లో జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. అయితే అది ఉత్తరాదిన ఒకలా దక్షిణాదిన ఒకలా ఉంది అని అంటున్నారు.
యువ భారతంగా :
అయితే ఈ పెరిగిన జనాభాను సక్రమంగా ఉపయోగించుకుంటే భారత్ ప్రపంచాన్ని శాసించగలదు అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో అరవై శాతం దాకా యువత ఉన్నారు. అంటే 20 నుంచి 35 ఏళ్ళ లోపు వారు అన్న మాట. వేరి సంఖ్య అక్షరాలా 80 కోట్ల దాకా ఉంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు కూడా పెరుగుతున్నారు. ఇక జెన్ జీ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తే కనుక వారు రాణిస్తారు. దేశానికి ఆర్ధికంగా చోదక శక్తిగా మారుతారు. అదే వారిని పక్కన పెడితే మాత్రం దేశానికే ఇబ్బంది కరం అవుతుంది. దీంతో భారత్ లో జనాభా పెరుగుదలను సానుకూలంగా ఏ విధంగా మార్చుకుంటారు అన్న దాని మీదనే దేశ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంది అని అంటున్నారు.
