టార్గెట్ ఇండియన్ జర్నలిస్ట్స్... పాక్ నిఘా నయా ప్లాన్ ఇదిగో!
అవును... ఓ పక్క ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటుంటే.. మరోపక్క రెచ్చగొట్టే మాటలతో పాక్ లోని పెద్దలు ప్రసంగిస్తున్నారు!
By: Tupaki Desk | 12 May 2025 7:27 PM ISTఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి మొదలైన భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మే 6, 7 తేదీల్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో మరింత వేడెక్కాయి. అనంతరం మార్చి 8, 9, 10 మధ్య ప్రధానంగా రాత్రుల్లో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఉద్రిక్తతలు తగ్గించాలనే ప్రయత్నాలు జరిగాయి.
కట్ చేస్తే.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఆ ప్రయత్నమూ జరిగింది, ట్రంప్ సఫలీకృతులయ్యారు. పాకిస్థాన్ లో సంబరాలు మొదలయ్యాయి. భారత్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్ గూఢచారులు మాత్రం భారత రహస్యాలను తెలుసుకోవడానికి జర్నలిస్టులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
అవును... ఓ పక్క ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటుంటే.. మరోపక్క రెచ్చగొట్టే మాటలతో పాక్ లోని పెద్దలు ప్రసంగిస్తున్నారు! ఇంకోవైపు.. భారత రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పాక్ గూఢచారులు. ఇందులో భాగంగా.. తమను తాము ఇండియన్ డిఫెన్స్ అధికారులుగా పేర్కొంటున్నారని అంటున్నారు.
ఇలా తమను తాము ఇండియన్ డిఫెన్స్ అధికారులుగా పేర్కొంటూ జర్నలిస్టులకు ఫోన్ చేసి "ఆపరేషన్ సింధూర్" కు సంబంధించి సైనిక అధికారులు చేసే బ్రీఫింగ్, పాక్ విషయంలో చేసే ప్రణాళికలు మొదలైన సమాచారాన్ని సేకరిస్తున్నారని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో తాజా యుద్ధంలో భారత్ లో ఏయే ప్రాంతాలు దెబ్బతిన్నాయని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన నిఘా వర్గాలు... భారతీయ అధికారులు ఎవరూ ఎవరికీ కాల్స్ చేయరని పేర్కొన్నాయి. అటువంటి కాల్స్ వస్తే ఆన్సర్ చేయొద్దని.. అనంతరం, తమకు సమాచారం ఇవ్వాలని సూచించాయి.
