భారత్ మీద పాక్ దారుణమైన స్కెచ్.... కేంద్రం వార్నింగ్
మళ్లీ ఏప్రిల్ నెల వచ్చేసింది. సరిగ్గా చూస్తే ఇదే ఏప్రిల్ నెల 2025 లో జమ్మూలోని పహిల్గాన్ లో ఉగ్రవాదులు దాడి చేసి ఏకంగా పాతిక మందికి పైగా భారత పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు.
By: Satya P | 3 April 2026 9:52 AM ISTమళ్లీ ఏప్రిల్ నెల వచ్చేసింది. సరిగ్గా చూస్తే ఇదే ఏప్రిల్ నెల 2025 లో జమ్మూలోని పహిల్గాన్ లో ఉగ్రవాదులు దాడి చేసి ఏకంగా పాతిక మందికి పైగా భారత పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతిగా మే నెల మొదటి వారంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ పీచమణచింది. నాటి నుంచి రగిలిపోతున్న పాక్ ఇపుడు మరోసారి భారత్ మీద కాలు దువ్వుతోంది అని అంటున్నారు. ఒక వైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో అదను చూసి భారత్ ని ముగ్గులోకి లాగాలని పాక్ చేస్తున్న దుష్ట ప్రయత్నాల మీద కేంద్రం అప్రమత్తంగా ఉంది అని అంటున్నారు.
రాజ్ నాథ్ వార్నింగ్ :
ఇదిలా ఉంటే పాకిస్థాన్ కి దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారీ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమాసినా యుద్ధం నేపధ్యంలో పరిస్థితులను అనువుగా తీసుకుని భారత్ మీదకు పాక్ వస్తే కనుక కోలుకోలేని దెబ్బ కొడతామని హెచ్చరించారు. కేరళలో తిరువనంతపురం లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రంలో రాజ్ నాథ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆయన పాక్ పేరు అయితే నేరుగా ప్రస్తావించకపోయినా వార్నింగ్ ఆ దేశానికే అని అందరికీ అర్ధం అవుతోంది. పొరుగు దేశం దుస్సాహసానికి దిగితే మాత్రం తీవ్రమైన చర్యలు భారత్ వైపు నుంచి ఉంటాయని రాజ్ నాథ్ చేసిన హెచ్చరికలతో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది.
కేంద్రం సీరియస్ గానే :
ఇదిలా ఉంటే అమెరికా ఇరాన్ మీద దాడుల విషయంలో పాక్ గగన తలాన్ని వాడుకోబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విధంగా అమెరికాను సాయం చేస్తూనే భారత్ ని కూడా ఈ యుద్ధంలోకి తేవాలని పాక్ ఒక దారుణమైన స్కెచ్ ని గీస్తోంది అని అంటున్నారు. దీని మీద కేంద్రం సైతం అప్రమత్తంగా ఉంటోంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, విదేశాంగ మంత్రి జై శంకర్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ఉన్నారని అంటున్నారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పాటు భారత్ మీద పాక్ కుయుక్తుల గురించి కూడా తీవ్రంగా చర్చ సాగింది అని అంటున్నారు. ఒక వేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఏమి చేయాలన్న దాని మీద ఈ మీటింగ్ లో చరించారు అని అంటున్నారు.
ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ :
ఈ నేపధ్యంలో తిరువనంతపురం సభలో రాజ్ నాధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆయన పాక్ ఉగ్రవాద చర్యలకు గతంలో ధీటుగా బదులిచ్చామని కూడా చెప్పారు. మరోసారి కవ్వింపు చర్యలకు దిగితే తిరుగులేని గుణపాఠం చెబుతామని కూడా స్పష్టం చేస్తున్నారు. భారత్ నుంచి అనూహ్యమైన రియాక్షన్ ని పాక్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రాజ్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద పశ్చిమాసియా యుద్ధం నేపధ్యంలో పాక్ భారత్ మీదకు రావాలని చూస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇంకో వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పదిహేను వందల దాకా ఉగ్రవాదులు భారత్ లో చొరబడేందుకు చూస్తున్నారు అన్న వార్తల మీద కూడా భారత నిఘా వర్గాల సమాచారం మేరకు సరిహద్దు బలగాలు అప్రమత్తం అయ్యాయని అంటున్నారు.
