Begin typing your search above and press return to search.

భయంతో నిలువెల్లా వణుకుతున్న పాక్

భారత్ ని చూసి పాక్ నిలువెల్లా వణుకుతోంది. బయటకు మాత్రం బడాయి కబుర్లు చెబుతోంది.

By:  Tupaki Desk   |   24 April 2025 3:05 PM IST
Cornered and Isolated Pakistan Trembles as Global Support
X

భారత్ ని చూసి పాక్ నిలువెల్లా వణుకుతోంది. బయటకు మాత్రం బడాయి కబుర్లు చెబుతోంది. నిజానికి భారత్ ముందు పాక్ ఎంత అన్నది ఆ దేశానికి బాగా తెలుసు. గతంలో ఉన్న పరిస్థితులు ఇపుడు లేవు. భారత్ ప్రపంచ దేశాలకు అత్యంత కీలకంగా ఉంది. ఐదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది.

భారత్ తో ప్రపంచానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అలాగే భారత్ కూడా ప్రపంచానికి కరోనా సమయంలో అండగా నిలబడింది. గుడ్డి విద్వేషం తో భారత్ మీద కక్షతో పాక్ ఒక్కతే అలా ఊగిపోతోంది. ఇకా ఎర్లీ ఐటీస్, నైంటీస్ నాటి సీమాంతర ఉగ్రవాదాన్ని రొటీన్ హింసను నమ్ముకుని పాక్ భారత్ మీద పగ సాధించాలని చూస్తోంది.

కానీ భారత్ కి మొత్తంగా మద్దతుగా నిలిచిన అంతరజాతీయ సమాజం పాక్ ని ఒంటరిని చేసింది. పైగా పాక్ కుట్రలు కుతంత్రాలు తమకు బాగా తెలుసు అని చెబుతోంది. ఈ రోజున పాక్ తాను మిత్రురాలిగా నమ్ముతున్న చైనా అయితే ఎలాంటి స్పందన పాక్ కి అనుకూలంగా ఇవ్వడం లేదు.

మరో వైపు చూస్తే ఇతర దేశాలు అన్నీ భారత్ వైపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఏమి చేసినా అంతర్జాతీయ సమాజం ఓకే అంటుంది. ఎందుకంటే బాధిత దేశంగా భారత్ ఉంది భారత్ పాక్ ని ఊచకోత కోసినా ఇదేమని అడిగేవారు లేరు. అయ్యో అని సానుభూతి చూపించేవారు ఉండరు.

అందుకే పాక్ వెన్నులో పూర్తిగా వణుకు పుడుతోంది. మేకపోతు గాంభీర్యంతో బయటకు ఉంటోంది. కరాచీ నుంచి లాహోర్ కి రావల్పిండికి యుద్ధ విమానాలు తరలింపు అయినా తన క్షిపణులను పరీక్షిస్తామని చెప్పడం అయినా భారత్ ని ఏదో విధంగా వెనక్కి తగ్గేలా చేయడం కోసమే అంటున్నారు.

నిజంగా భారత్ మూడవ కన్ను తెరిస్తే పాక్ భస్మీపటలం అవడం ఖాయం. ఈ నేపధ్యంలో పాక్ కి ఆయుధ సాయం కాదు కదా మాట సాయం చేయడానికి కూడా ఏ దేశమూ రాదని పాక్ కి బాగా అర్ధం అవుతోంది. పాక్ కళ్ళ ముందు గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గుర్తుకు వచ్చి చిగురుటాకులా భయకంపితం అవుతోంది.

ఈ నేపధ్యంలో పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. భారత్ బెదిరించినా లేక దాడి చేసినా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి దేశం కోసం ఒక్కటి అవుతామని ప్రకటించారు. అంతే కాదు మాతృ భూమిని కాపాడుకోవడానికి పా జెండా కింద అంతా ఐక్యంగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదంతా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేసిన దాని సారాంశం.

అదే సమయంలో ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మోడీ మంత్రివర్గం తన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణాయలను ఆయన ప్రస్తావిస్తూ యుద్ధానికి దారి తీసే చర్యలు వద్దని కోరారు యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఆశిస్తున్నట్లు ఆయన పోస్ట్ చేసిన మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

దీనిని బట్టి చూస్తే పాక్ కి తెలుసు. భారత్ కచ్చితంగా దాడి చేస్తుందని, దానిని తాము ఏ విధంగానూ తట్టుకోలేమని కూడా తెలుసు అని అంటున్నారు. అయితే భారత్ ఢీ కొడితే మాత్రం తాము పూర్తిగా ఇబ్బందులో పడతామని తెలిసినా పాక్ ఉగ్ర దాడులకు తెగబడుతోంది. అయితే భారత్ మాత్రం తగ్గేది లేదని అంటోంది. దాంతో పాక్ కి మూడిందనే అంతా అంటున్నారు.