Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగిందిలా.. విశాఖపైనే దృష్టి ఎందుకంటే?

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ జరగ్గా.. విశాఖ వన్ టౌన్ లోనూ సక్సెస్ ఫుల్ గా జరిగింది.

By:  Tupaki Desk   |   7 May 2025 11:41 PM IST
Visakhapatnam’s Strategic Importance Highlighted in Nationwide Mock Drill Exercise
X

భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 259 చోట్ల సివిల్ మాక్ డ్రిల్స్ విజయవంతంగా ముగిసింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ జరగ్గా.. విశాఖ వన్ టౌన్ లోనూ సక్సెస్ ఫుల్ గా జరిగింది.

అవును... కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్ జరిగింది. ఇందులో భాగంగా.. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది.

ఒక వేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డీ.ఆర్.ఎఫ్. సిబ్బంది ప్రజలకు వివరించారు. ఈ మాక్ డ్రిల్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఇదే సమయంలో.. విశాఖలోని వన్ టౌన్ లో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 54 ఏళ్ల తర్వాత జరిగిన ఈ కార్యక్రమంపై వృద్ధులు తమ తమ అనుభవాలు పంచుకున్నారు!

ఈ విధంగా దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ని 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల ఈ మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా వంటి మెట్రోలు ఉన్నాయి. ఈ సందర్భంగా సుమారు 100కు పైగా సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ని అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు.

విశాఖ ఎందుకు కీలకం?:

యుద్ధం అనివార్యమైతే అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటి. ఎందుకంటే... తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం ఇక్కడే ఉంది. ఇదే సమయంలో జెట్ ఫ్రైటర్లు, మిగ్ 29కే లకు శిక్షణ ఇచ్చే ఐ.ఎన్.ఏస్. డేగ.. మెరైన్ కమెండోలకు శిక్షణ ఇచ్చే ఐ.ఎన్.ఎస్. కర్ణ.. సబ్ మెరైన్ లో పనిచేసేవారికి శిక్షణ ఇచ్చే ఐ.ఎన్.ఎస్. శాతవాహన ఇక్కడే ఉన్నాయి.

ఇదే సమయంలో డీ.ఆర్.డీ.వో. పరిధిలోని నేవల్ సైన్స్ & టెక్నాలజీ లేబరేటరీ (ఎన్.ఎస్.టీ.ఎల్) ఇక్కడే ఉంది. వీటితో పాటు బీ.హెచ్.ఈ.ఎల్., యుద్ధ నౌకల నిర్మాణం చేసే, పాతవాటిని రిపేర్ చేసే హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖలోనే ఉన్నాయి. వీటితో పాటు దేశంలో మేజర్ పోర్టుల్లో ఒకటైన విశాఖ పోర్టు అథారిటీ ఇక్కడే ఉంది.