Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ ను ఏడిపించేస్తోన్న భారత్... తెరపైకి దాయాదీ కొత్త కష్టం!

అవును... పహల్గాం దాడికి ప్రతి చర్యగా మే 2న పాకిస్థాన్‌ కు సరుకులు తీసుకెళుతున్న లేదా అక్కడి నుంచి సరకులు తరలిస్తున్న నౌకలు తమ ఓడరేవుల్లోకి రావడంపై భారత్ నిషేధం విధించింది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 8:00 AM IST
పాకిస్థాన్ ను ఏడిపించేస్తోన్న భారత్... తెరపైకి దాయాదీ కొత్త కష్టం!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న పలు దౌత్యపరమైన నిర్ణయాలతో పాక్ కు బలమైన దెబ్బలే తగులుతున్నాయి. పైకి మేకపోతు గాంభిర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. కేవలం సిధూ నదీ జలాల ఒప్పందం గురించే ప్రధానంగా మాట్లాడుతూ, పెద్ద పెద్ద మాటలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. తాజాగా పాక్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.

అవును... పహల్గాం దాడికి ప్రతి చర్యగా మే 2న పాకిస్థాన్‌ కు సరుకులు తీసుకెళుతున్న లేదా అక్కడి నుంచి సరకులు తరలిస్తున్న నౌకలు తమ ఓడరేవుల్లోకి రావడంపై భారత్ నిషేధం విధించింది. ఈ క్రమంలో దాని ప్రభావం ఆ దేశంపై బలంగా చూపిస్తోంది. ఈ క్రమంలో... ఇస్లామాబాద్‌ షిప్పింగ్‌ కోసం అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

తాజాగా పాకిస్థాన్ లోని పత్రిక 'డాన్‌' కథనంలో ప్రకారం... భారీ నౌకలు పాకిస్థాన్ లోని రేవులకు వెళ్లడానికి ఇష్టపడటంలేదు. దీంతో ఇస్లామాబాద్‌ కు దిగుమతులు, ఎగుమతులపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా... కనీసం 30 నుంచి 50 రోజుల వరకు జాప్యం చోటు చేసుకొంటోంది.

దీంతో దిగుమతి దారులు ఫీడర్‌ వెస్సల్స్‌ ను నమ్ముకోవాల్సి వస్తోంది. తాజాగా ఈ విషయాలను కరాచీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ జావెద్‌ బిల్వాని వెల్లడించారు. ఇదే సమయంలో లాజిస్టిక్ ధరలు గణనీయంగా పెరిగాయని.. షిప్పింగ్ ధరలు కూడా పెరగడం ఇబ్బంది పెడుతోందని అమిర్ అజిజ్ అనే వస్త్ర ఎగుమతిదారుడు వెల్లడించారు.

మరోవైపు పాక్‌ వస్తువులు ఎటువైపునుంచీ దేశంలోకి రాకుండా భారత ప్రభుత్వం పలు ఆపరేషన్లు చేపట్టింది. డైరెక్టరేట్‌ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ డీప్‌ మానిఫెస్ట్‌' కూడా దీనిలోని భాగమే. దీంతో... యూఏఈ వంటి దేశాల నుంచి భారత్‌ లోకి వచ్చే పాకిస్థాన్ సరుకులను కట్టడి చేసింది.

ఈ క్రమంలో.. ఏకంగా 39 కంటైనర్లలోని సుమారు రూ.9 కోట్ల విలువైన 1,100 మెట్రిక్‌ టన్నుల సరుకులను సీజ్‌ చేశారు. ఇవి యూఏఈలో తయారైనట్లు తప్పుడు రికార్డులు సృష్టించి దేశంలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఇవి పాకిస్థాన్ లో తయారైనవని చెబుతున్నారు.