కొత్త రెడ్ లైన్... భారత్ - పాక్ జనరల్స్ వార్ ఆఫ్ వర్డ్స్ పీక్స్!
ఆసియా ప్రముఖ రక్షణ సదస్సు షాంగ్రిలా డైలాగ్ లో భారత్, పాకిస్థాన్ ఉన్నత సైనాధికారులు ఉగ్రవాదం, సరిహద్దు ఘర్షణలపై కొత్త రెడ్ లైన్ ను గీస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
By: Tupaki Desk | 2 Jun 2025 10:34 AM ISTఆసియా ప్రముఖ రక్షణ సదస్సు షాంగ్రిలా డైలాగ్ లో భారత్, పాకిస్థాన్ ఉన్నత సైనాధికారులు ఉగ్రవాదం, సరిహద్దు ఘర్షణలపై కొత్త రెడ్ లైన్ ను గీస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో ఇద్దరు సైనికాధికారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కూడా తాము ఉగ్రవాద బాధితులమని చెప్పడం గమనార్హం!
అవును... జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాడిలో 26 మంది మరణించిన అనంతరం.. ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, పాక్ ఉన్నత సైనికాధికారులు ఉగ్రవాదం, సరిహద్దు ఘర్షణలపై కొత్త రెడ్ లైన్ ను గీస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా భారత్ ఆరోపణలు పాక్ తోసిపుచ్చింది!
ఈ సందర్భంగా స్పందించిన భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్... ఉగ్రవాదం పట్ల భారత్ కొత్త జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తుందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ సమయంలో... భారత్ రాజకీయంగా ఉగ్రవాదం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కొత్త రెడ్ లైన్ ను గీసిందని.. ఆపరేషన్ సిందూర్ తో దీనిపై స్పష్టత ఇచ్చిందని తెలిపారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మా ప్రత్యర్థికి ఒక పాఠం కావాలని.. వారు భారతదేశ సహన పరిమితిని గుర్తించాలని ఆశిస్తున్నట్లు జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్ధాలుగా ఉగ్రవాదం వల్ల భారత్ అనేక ప్రాణాలు కోల్పోయిందని.. ఇక దాన్ని అంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
భారత్ ఈ రేంజ్ లో స్పందించేసరికి పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షమ్షాద్ మీర్జా... ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ ఘర్షణ స్థాయి ప్రమాదకరంగా పెరిగితే.. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకునేలోపు విధ్వంసం జరగొచ్చని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం వల్ల పాక్ కూడా నష్టపోయిందని చెప్పారు!
ఇలా... ఉగ్రవాదం పాక్ కూడా భారీ మూల్యం చెల్లించిందని చెప్పిన సాహిర్ షమ్షాద్ మీర్జా.. ఉగ్రవాదం వల్ల పాకిస్థాన్ వందల బిలియన్ డాలర్లు, వేలాది ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తా నుంచి వచ్చే సరిహద్దు ఉగ్రవాద బెదిరింపులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నామని అన్నారు.
