భారత్ నుంచి 786.. పాకిస్తాన్ నుంచి 1376..రూల్స్ బ్రేక్ చేస్తే జైలే
దీంతో పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్లంతా ఇండియాను వదిలిపోతుంటే... అక్కడ ఉన్న మనోళ్లంతా తిరిగొచ్చేస్తున్నారు.
By: Tupaki Desk | 30 April 2025 11:59 AM ISTపహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియా బాగా సీరియస్ అయింది. దానిలో భాగంగా ఇక్కడ రకరకాల వీసాలతో ఉన్న పాకిస్తాన్ సిటిజన్లందరూ ఒక నిర్ధిష్ట గడువులోపు వాళ్ల దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆర్డర్ వేసింది. దీంతో పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్లంతా ఇండియాను వదిలిపోతుంటే... అక్కడ ఉన్న మనోళ్లంతా తిరిగొచ్చేస్తున్నారు.
అధికారులు చెప్పిన ప్రకారం.. ఏప్రిల్ 24 నుంచి 29 మధ్యలో పంజాబ్‌లో ఉండే అటారీ-వాఘా బోర్డర్ గుండా 786 మంది పాకిస్తాన్ వాళ్లు కార్లలో వాళ్ల ఊళ్లకు పోయారు. అదే టైంలో అక్కడి నుంచి 1,376 మంది మనోళ్లు ఇండియాకి తిరిగొచ్చేశారు.
ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ వాళ్లంతా ఏప్రిల్ 26 లోపల దేశం వదిలిపోవాలని మొన్ననే కేంద్రం ఆర్డర్ పాస్ చేసింది. మెడికల్ వీసాతో వచ్చిన వాళ్లకి మాత్రం ఈ నెల 29 వరకు టైమ్ ఇచ్చింది. బిజినెస్, టూరిస్ట్, స్టూడెంట్ ఇలాంటి 12 రకాల వీసాలు ఉన్నోళ్లంతా ఏప్రిల్ 27 నాటికి పోవాలని గట్టిగా చెప్పింది. దీనితో చాలా ఏళ్లుగా ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ వాళ్లు వాళ్ల ఫ్యామిలీలను వదిలి సొంతూళ్లకు తిరిగి వెళ్తుండటంతో బోర్డర్ దగ్గర చాలా ఎమోషనల్‌గా ఉంది సీన్. 29తో భారత ప్రభుత్వం వాళ్లకిచ్చిన టైమ్ అయిపోయింది. దానిలో భాగంగానే సార్క్ వీసా స్కీమ్ ద్వారా ఇండియా తిరుగుతున్న పాకిస్తాన్ వాళ్లని 48 గంటల్లో తిరిగి వాళ్ల దేశానికి పోవాలని మన ప్రభుత్వం కోరింది.
జనాలకు ఇచ్చిన టైమ్ అయిపోవడంతో కేంద్రం ఆర్డర్ ప్రకారం బుధవారం అధికారులు అటారీ-వాఘా బోర్డర్‌ను మూసేశారు. ఏప్రిల్ 4 నుంచి వచ్చిన 'ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025' ప్రకారం... టైమ్ అయినా ఇక్కడే ఉంటే, వీసా రూల్స్ తప్పితే, వెళ్లకూడని ప్లేస్‌లకు వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల వరకు ఫైన్ వేస్తామని భారత ప్రభుత్వం పాకిస్తాన్ వాళ్లకి వార్నింగ్ ఇచ్చింది.
