Begin typing your search above and press return to search.

భారత్ లేదా పాక్.. తొలి దాడి ఎవరికి చేటు? అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   1 May 2025 2:00 PM IST
India Dilemma with Pakistan Explained In War
X

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత్ పాకిస్తాన్ చర్యలకు దీటైన సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్పుడైనా యుద్ధం సంభవించే అవకాశం లేకపోలేదు. అందుకే భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ జల సంధిని నిలిపివేయడం, పాకిస్తానీయుల వీసాలను రద్దు చేయడం, దౌత్య సంబంధాలను తగ్గించడం వంటి కీలక చర్యలకు పాల్పడింది. ప్రతిగా పాకిస్తాన్ కూడా భారత్ కోసం తన గగనతలాన్ని మూసివేసింది. భారత్ జల ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు పాకిస్తాన్ నుండి తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది.

ప్రస్తుం పాకిస్తాన్ భారత్‌ను చూసి భయపడుతోంది. భారత్ ఎప్పుడైనా యుద్ధానికి మొదటి దాడి చేయగలదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, భారత్ లేదా మరే ఇతర దేశమైనా మరొక దేశంపై మొదటి దాడి చేస్తే ఆ దేశానికి ఎంత నష్టం వాటిల్లుతుంది? ఈ కథనంలో తెలుసుకుందాం.

అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన

ఒక శత్రు దేశంపై మొదటి దాడి చేయడం వల్ల లాభాలు ఎంత ఉంటాయో నష్టాలు కూడా అంతే ఉంటాయి. మొదటి దాడి వల్ల శత్రువు బలహీనంగా ఉన్న సమయంలో అనూహ్యంగా నష్టం కలిగించవచ్చు. అయితే ఇది అంతర్జాతీయ చట్టాలు, భద్రతా ప్రోటోకాల్‌ల ఉల్లంఘనకు దారితీస్తుంది. అంతేకాకుండా మొదటి దాడి చేయడం వల్ల ఆ దేశానికి ఆర్థిక, సైనిక, సామాజికంగా కూడా నష్టం వాటిల్లుతుంది.

క్షీణించిన ఆర్థిక పరిస్థితి

అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఎటువంటి చట్టబద్ధమైన కారణం లేకుండా మరొక దేశంపై దాడి చేయడం యుద్ధ నేరంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో మొదటి దాడి చేసిన దేశాన్ని ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు శిక్షించవచ్చు. యుద్ధ పరిస్థితుల్లో ఒక దేశానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. సైనిక పరికరాలు, సైనికులు, ఇతర యుద్ధ సంబంధిత ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది.

సైనిక నష్టం

ఏ పరిస్థితిలోనైనా మొదటి దాడి చేసే దేశం తమ సైనికుల ప్రాణాలను కోల్పోయే.. వారు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. ఇది దేశ సైనిక శక్తిని తగ్గిస్తుంది. అంతేకాకుండా యుద్ధం వల్ల సామాజికంగా కూడా నష్టం కలుగుతుంది. దేశంలో నేరాలు, సామాజిక అశాంతి, పౌర హింస పెరిగే ప్రమాదం ఉంది. దేశ నిర్మాణం బలహీనపడుతుంది. ప్రజల విశ్వాసం కూడా తగ్గుతుంది.