పాక్ కు ఈ రాత్రి కాళరాత్రే... తెరపైకి సంచలన అప్ డేట్స్!
ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాక్ భారత్ ను దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేస్తూ బోర్లా పడుతుంది!
By: Tupaki Desk | 8 May 2025 11:38 PM ISTఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాక్ భారత్ ను దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేస్తూ బోర్లా పడుతుంది! గురువారం ఉదయం భారత్ లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది.. క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. అయితే.. పాక్ ప్రయత్నాన్ని భారత్ బలంగా తిప్పికొట్టింది. అనంతరం పాక్ గగనతలాన్ని వణికించేసింది.
ఇందులో భాగంగా లాహోర్ సహా పాకిస్థాన్ లోని ఏడు కీలక ప్రాంతాల్లోని గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది! మరోపక్క లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో తీవ్ర బాంబుల శబ్ధాలు వినిపించినట్లు పాక్ మీడియా తెలిపింది. ఇక.. రావల్పిండిలోని క్రికెట్ స్టేడియం సమీపంలోనూ డ్రోన్ దాడులు జరిగినట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి జమ్మూ సహా పంజాబ్, రాజస్థాన్ లలో పాకిస్థాన్ దాడులకు తెగబడింది. ఇందులో భాగంగా ప్రధానంగా జమ్మూ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇలా పాకిస్థాన్ నుంచి సుమారు ఎనిమిది క్షిపణులను ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకొందని సమాచారం.
ఇదే సమయంలో... పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ ని భారత్ చాకచక్యంగా కూల్చివేసిందని తెలుస్తోంది. ఇదే సమయంలో... పాక్ కి చెందిన రెండు జేఎఫ్-17 ఫైటర్స్ జెట్స్ ని కూడా భారత్ కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పాక్ ప్రయత్నాలను గాల్లో కలిపేసింది భారత సైన్యం. అనంతరం.. కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేసింది.
అవును... గురువారం రాత్రి జమ్మూ లక్ష్యంగా పాక్ సుమారు 8 డ్రోన్లు, మూడు ఫైటర్ జెట్ లను ప్రయోగించి కాస్త హడావిడి చేసిన అనంతరం భారత్ ఆర్మీ కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేసింది! ఇందులో భాగంగా... లాహోర్, సియాల్ కోట్ పై దాడి మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీనికోసం భారత్ ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయని సమాచారం. దీంతో.. ఈ రాత్రి కూడా పాక్ కు కాళరాత్రే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
భారత్ కస్టడీలో పాక్ పైలట్!:
గురువారం ఉదయం నుంచి భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసే ప్రయత్నాలు పాక్ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్ బలం ముందు ఆ ఆటలు సాగలేదు. రాత్రి జమ్మూలోనూ పాక్ ఫైటర్ జట్ లను భారత్ దెబ్బతీసింది. ఈ సమయంలో పాక్ కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ పైలట్ ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. జైసెల్మేర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం!
అటు ఎఫెన్స్.. ఇటు డిఫెన్స్!:
గురువారం మొత్తం భారత్ పై దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను గాల్లో కలిపేసిన భారత్.. గురువారం రాత్రి 10 - 11 గంటల మధ్యలో కౌంటర్ ఎటాక్స్ స్టార్ చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క పాక్ డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకునేందుకు రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా.. ఎస్-400, ఎల్-70, జెడ్.ఎస్.యూ-23తో పాటు షీక్లా గగనతల రక్షణ వ్యవస్థలను మొహరించింది.
మోడీ – అజిత్ దోవల్ ఎమర్జెన్సీ మీటింగ్!:
ప్రస్తుతం పాక్ దూకుడు ప్రదర్శిస్తున్న వేళ, భారత్ కౌంటర్స్ స్టార్ట్ చేసిందని తెలుస్తోన్న నేపథ్యంలో... హస్తినలో కీలక సమావేశం మొదలైంది! ఇందులో భాగంగా... ప్రధాని మోడీతో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యవసర సమావేశమయ్యారు! మరోవైపు త్రివిధ దళాధిపతులు, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ!
దీంతో... ఆపరేషన్ సిందూర్ 2.0 దిశగా భారత్ ఆలోచిస్తుందా.. లేక ఇక పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉందా అనే చర్చ బలంగా మొదలైందని తెలుస్తోంది. అయితే... అన్ని విధాలా పాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కు ఇదే సువర్ణావకాశం అనే కామెంట్లు పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారుల నుంచి వినిపిస్తున్నాయి!
