Begin typing your search above and press return to search.

'మే నెలలో ఏప్రిల్ ఫూల్'!... భారత్ కు ఎందుకు ఈ దయణీయ స్థితి?

కాసేపటి తర్వాత విక్రమ్ మిస్రీ ఎంట్రీ ఇచ్చారు! సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. అలా చేయడం సరికాదని అన్నారు.

By:  Tupaki Desk   |   11 May 2025 9:59 AM IST
మే నెలలో ఏప్రిల్  ఫూల్!... భారత్  కు ఎందుకు ఈ దయణీయ స్థితి?
X

గురు, శుక్ర, శని వారాల్లో భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వందల డ్రోన్లు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలతో భారత్ పై పాక్ విచక్షణారహితంగా విరుచుకుపడిందని కేంద్రం తెలిపింది. స్కూళ్లు, హాస్పటల్స్ పైనా డ్రోన్లు ప్రయోగిస్తుందని తెలిపింది! ఇదే సమయంలో అసత్య ప్రచారం చేయడంలో పాక్ ది అందెవేసిన చేయి అని పేర్కొంది.

ఇన్ని చెప్పిన అదే కేంద్రం.. శనివారం సాయంత్రం ఓ ప్రకటన చేసింది! ఇందులో భాగంగా... సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని.. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిక్రమ్ మిస్రీ చెప్పారు. ఈ మేరకు పాకిస్థాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్ డీజీఎంవో కు ఫోన్ చేశారని.. ఈ సమయంలో.. ఇరు పక్షాలు భూమిపైనా, గాలిలో, సముద్రంలో కాల్పులు, సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపేయాలని అంగీకరించాయని చెప్పుకొచ్చారు!

ఇదే సమయంలో ఈ అండర్ స్టాండింగ్ ని అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయని.. మే 12న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ మళ్లీ మాట్లాడతారని విక్రమ్ మిస్రీ తెలిపారు. అదేవిధంగా... “కాల్పుల విరమణపై ఇరుదేశాల సైన్యానికి తగిన ఆదేశాలు జారీ అయ్యాయని” వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన పాకిస్థాన్ డిప్యూటీ పీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పాకిస్థాన్, భారత్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీని తర్వాత చాలా పవర్ ఫుల్ మాట అన్నారు! అదేమిటంటే... “పాకిస్థాన్ ఎల్లప్పుడూ శాంతిభద్రతల కోసమే పాటుపడుందని”!

కేంద్రం గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ వైఖరిని తప్పుబడుతూ చెబుతున్నవన్నీ సగటు భారతీయుడు విన్నాడు! శనివారం సాయంత్రం చెప్పిన "విరమణ" మాటలూ విన్నాడు! కాల్పుల విరమణకు గల కండిషన్స్ ఏమిటని ప్రశ్నించకుండానే విన్నాడు! "ట్రంప్" నామస్మరణ చేసుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు!

కట్ చేస్తే... మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల మోత మొదలైందనే ప్రచారం తెరపైకి వచ్చింది. సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్తూ వెళ్తూ తెచ్చుకున్న నాలుగూ వేసేసి పోదామని పాక్ భావించి ఉండొచ్చేమో అని ఒకరంటే... పాకిస్థాన్ అలా చేయదు, ఒక వేళ చేసినా.. ట్రంప్ రాత్రంతా కష్టపడి కాల్పుల విరమణకు ఒప్పించారు కాబట్టి.. ఆ కాల్పులు నిజమైనా చేయగలిగేదేమీ లేదని గొణుకున్నారు!

కాసేపటి తర్వాత విక్రమ్ మిస్రీ ఎంట్రీ ఇచ్చారు! సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. అలా చేయడం సరికాదని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి నియంత్రణ రేఖ వెంబడి పాక్ చేస్తుంది అదే కదా!? అనే విషయం అప్పుడు సగటు భారతీయుడి గుర్తుకు వచ్చింది!

మిస్రీ మాట్లాడుతున్నారు... డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని "ఖండిస్తున్నట్లు" చెప్పారు. ఇది అత్యంత దుర్మార్గమని "ఘాటుగా" స్పందించారు. ఈ సమయంలో పాకిస్థాన్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారలు ఇచ్చామని తెలిపారు. అనంతరం... "ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలు పాక్ ఆపుతుందని ఆశిస్తున్నట్లు" చెప్పారు.

సరిగ్గా ఈ ప్రెస్ మీట్ తర్వాతే... మళ్లీ నిద్రమత్తులోకి జారుకుంటున్న సగటు భారతీయుడి నోటి నుంచి ఒక మాట వచ్చిందని చెబుతున్న్నారు! అదే... "భారత్ కు ఎందుకు ఇంత దయణీయ స్థితి?" అని! వాళ్లే ఉగ్రవాదులను పహల్గాం పంపించారని కేంద్రం చెప్పింది! వాళ్లే యుద్ధం మొదలుపెట్టారని కేంద్రం చెప్పింది!

అదే కేంద్ర... శనివారం వాళ్లే ఫోన్ చేశారని చెప్పింది! వాళ్లే ఉల్లంఘనలు పాల్పడుతున్నారని చెప్పింది! ఈ ఉల్లంఘనలు ఆపుతుందని ఆశిస్తున్నట్లు కేంద్రమే చెప్పింది! మళ్లీ సగటు భారతీయుడి నుంచి అదే మాట రిపీట్... "భారత్ కు ఎందుకు ఇంత దయణీయ స్థితి?" అని!

ఈ సమయంలో... మే నెలలో భారత్ ను పాకిస్థాన్ కాసేపు ఏప్రిల్ ఫూల్ చేయలేదు కదా? మదిలో మరో సందేహం! ఆదివారం మన కేంద్ర ప్రభుత్వం ఏమి చెబుతుందో చూడాలనే ఎదురుచూపుతో సగటు భారతీయుడు ప్రశాంతతకు – ఆందోళనకు మధ్య నలుగుతూ, దయణీయ స్థితిని తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు!