హతవిధీ... యుద్ధం ఆగడానికి ఇదా కారణం?
అవును... భారత్ లోని సుమారు 140 కోట్ల మందిలో మెజారిటీ పౌరులు ఊహించని రితీలో యుద్ధం ఆగిపోయింది!
By: Tupaki Desk | 11 May 2025 11:16 AM ISTగత కొన్ని రోజులుగా భారత్ - పాక్ మధ్య తీవ్రంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు శనివారం సాయంత్రం 5 గంటలకు అధికారికంగా చల్లబడ్డాయి. ఈ సమయంలో ‘దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు స్పందించారు! ఈ సమయంలో.. భారత్ – పాక్ మధ్య యుద్ధం ఆగడానికి ఇదే అసలు కారణం అంటూ ఒక విశ్లేషణ అంతర్జాతీయ మీడియాలో వస్తుంది!
అవును... భారత్ లోని సుమారు 140 కోట్ల మందిలో మెజారిటీ పౌరులు ఊహించని రితీలో యుద్ధం ఆగిపోయింది! దీంతో.. మొదలైనప్పుడు మోడీ సర్కార్ పై ఎంతటి ప్రశంసలు, అభినందనలు వచ్చాయో.. ఈ ప్రకటన రాగానే అవన్నీ రివర్స్ అయ్యాయనే చర్చ నెట్టింట మొదలైంది! అయితే... కాల్పుల విరమణకు పాకిస్థాన్ ఒప్పుకోవడానికి ఓ కారణం ఉందంటూ కథనాలొస్తున్నాయి!
ఇందులో భాగంగా... భారత్ వ్యతిరేకించినప్పటికీ పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 1 బిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8,500 కోట్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సహాయన్ని తక్షణం పాకిస్థాన్ కు అందిస్తామని ప్రకటించింది!
అయితే... యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ నుంచి కీలక దేశాలు (యూఎస్!) కండిషన్ పెట్టాయని.. అందువల్లే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిందని కథనాలొస్తున్నాయి. దీంతో... ఇది పాకిస్థాన్ / అమెరికా రాయించుకున్న పెయిడ్ న్యూస్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు నెటిజన్లు!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ప్రస్తుతం భారత్ - పాక్, ఇరు దేశాలు ఉన్న పరిస్థితుల్లో యుద్ధం ఆపాల్సిన అవసరం భారత్ కంటే ఎన్నో రెట్లు పాకిస్థాన్ కి ఉంది! అలాంటి పాకిస్థాన్ ను ఆయుద్ధం పకపోతే భారత్ కు ఇబ్బంది అన్నట్లుగా అమెరికా ఆడ్డొచ్చి, ఐఎంఎఫ్ నిధులు కావాలంటే యుద్ధం ఆపాలని కండిషన్ పెట్టిందని కథనాలు రావడం ఏమిటో?
ఏది ఏమైనా... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వమే కారణం అని చెప్పడం.. ఇప్పుడు ఇలాంటి కథనాలు అంతర్జాతీయ మీడియాలో రావడం... ఈ ప్రపంచానికి తానే పెద్దన్న అని ట్రంప్ మరోసారి గుర్తుచేయడం కూడా అయ్యి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు!
