Begin typing your search above and press return to search.

పాక్ పై భారత్ యుద్ధం.. సంచలన విషయం చెప్పిన మాజీ దౌత్యవేత్త!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత్ ఏ క్షణమైన యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 May 2025 1:43 PM IST
పాక్ పై భారత్ యుద్ధం.. సంచలన విషయం చెప్పిన మాజీ దౌత్యవేత్త!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరుతుంది పాకిస్థాన్. మరోపక్క జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేసే పనిలో భారత సైన్యం బిజీగా ఉంది. ఈ సమయంలో పాకిస్థాన్ పై భారత్ ఎప్పుడు దాడి చేసేది చెబుతున్నారు ఆ దేశ మాజీ దౌత్యవేత్త.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత్ ఏ క్షణమైన యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. 1971 తర్వాత భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా... బుధవారం అన్ని రాష్ట్రాల్లోనూ సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యలోనే పాక్ మాజీ దౌత్యవేత్త సంచలన ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... రష్యా విక్టరీ డే (మే9) తర్వాత పాకిస్థాన్ పై భారత్ దాడి చేసే అవకశం ఉందని పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో.. 10, 11 తేదీలలో దాడి చేసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

మరోవైపు.. పాకిస్థాన్ పై దాడి చేసేందుకు భారత్ సిద్ధమవుతోందని అంటున్నారు. ఈ వారాంతంలో ఎప్పుడినా పాక్ పై భారీ స్థాయిలో భారత్ "ఆపరేషన్" చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యలోనే మోడీ సర్కర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. యుద్ధ సన్నద్దతను సరి చూసుకునేందుకు బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.

ఇదే సమయంలో యుద్ధ సన్నద్దతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమీక్ష చేపట్టింది! రేపటి మాక్ డ్రిల్స్ దృష్ట్యా పలు రాష్ట్రాల అధికారులతో హోంశాఖ మంగళవారం సమావేశం చేపట్టింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది! సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్షించారు!

కాగా.. 1971 తర్వాత భారత్ లో ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి! నాడు కూడా పాక్ తో యుద్ధం నేపథ్యంలోనే ఈ తరహా చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్ లో భాగంగా వాయుదాడుల సైరన్ లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు.

ఈ నేపథ్యలోనే రష్యా విక్టరీ డే (మే9) తర్వాత పాకిస్థాన్ పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ ట్వీట్ చేశారు. 10, 11 తేదీలలో దాడి చేసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.