Begin typing your search above and press return to search.

మన దేశంలో లైఫ్ స్టైల్ వ్యాపారం లెక్కలు తెలిస్తే వావ్ అనాల్సిందే

తాజాగా ఒక రిపోర్టు విడుదలైంది. డీ కోడింగ్ ఇండియాస్ ఆన్ లైన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ షాపింగ్ ట్రెండ్స్ లో పేర్కొన్న పలు అంశాలు విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   17 April 2025 9:00 PM IST
మన దేశంలో లైఫ్ స్టైల్ వ్యాపారం లెక్కలు తెలిస్తే వావ్ అనాల్సిందే
X

ఇంటర్నెట్ ఎంట్రీ వాణిజ్య రంగ రూపురేఖల్ని మార్చేసింది. వినూత్న ఆలోచనలు మాత్రమే కాదు సరికొత్త వ్యాపార ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సంప్రదాయ వ్యాపారానికి భిన్నంగా తెర మీదకు వచ్చిన ఆన్ లైన్ షాపింగ్ కు మించి సరికొత్త షాపింగ్ ప్లాట్ ఫాంకు సోషల్ మీడియా వేదికగా మారింది. ఈ మాధ్యమంలో వస్తువుల కొనుగోళ్లు.. అమ్మకాలు భారీగా సాగుతున్నాయి. ఇందులో లైఫ్ స్టైల్ ఉత్పత్తుల షాపింగ్ భారీగా సాగుతోంది. దీనికి సంబంధించి తాజాగా ఒక రిపోర్టు విడుదలైంది. డీ కోడింగ్ ఇండియాస్ ఆన్ లైన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ షాపింగ్ ట్రెండ్స్ లో పేర్కొన్న పలు అంశాలు విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి.

ప్రస్తుతం లైఫ్ స్టైల్ మార్కెట్ విలువ రూ.11,174 కోట్లు. మూడేళ్లలో ఇది కాస్తా రూ.18,049 కోట్లకు చేరనుంది. దాదాపు 17.5 కోట్ల మంది భారతీయులు జీవనశైలి ఉత్పత్తుల కోసం ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఏడాదిలో సగటున ఆరేడు లావాదేవీల్ని చేస్తున్నారు. లైఫ్ స్టైల్ మార్కెట్ లో అత్యధిక ఫ్యాషన్ ఉత్పత్తులదే కావటం గమనార్హం. ఇందులో బ్యూటీ... పర్సనల్ కేర్ ఉత్పత్తులు ఉన్నాయి. 2028నాటికి ఆన్ లైన్ ఫ్యాషన్.. లైఫ్ స్టైల్ మార్కెట్ ఇప్పుడున్న రూ.1477 కోట్ల నుంచి రూ.3876 కోట్లకు చేరునుందన్న అంచనాల్ని తాజా రిపోర్టు వెల్లడించింది.

జీవనశైలి బ్రాండ్ లకు ఆదరణ అంతంతకూ ఎక్కువ అవుతోంది. ప్రపంచంలోని టాప్ 50 జీవనశైలి బ్రాండ్లకు సంబంధించి 90 శాతం మన దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ బ్రాండ్లలో సగంరూ.2585 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ క్రమంలో 2029నాటికి ఈ కామర్స్ వినియోగదారుల 50.1 కోట్లకు చేరుకుంటుందన్న అంచనా వ్యక్తమైంది. ఆన్ లైన్ లావాదేవీల్లో 60 శాతం స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతుందని.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయం.. వర్చువల్ ట్రయల్స్.. వాయిస్ అసిస్టెడ్ షాపింగ్ వంటి సాంకేతిక సౌకర్యాలు తోడు కావటంతో ఆన్ లైన్ షాపింగ్ పెరుగుదలకు దోహపడుతుందని చెబుతున్నారు.

సోషల్ మీడియా కూడా షాపింగ్ లో కీలకంగా మారింది. ఇన్ స్టా.. వాట్సప్.. ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల ద్వారా హోల్ సేల్ వ్యాపారుల నుంచి తాము అమ్మాలనుకున్న వస్తువులకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు పోస్టు చేయటం ద్వారా కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తున్నారు. దేశంలోని 82 శాతం మంది ఏదో ఒక సోషల్ మీడియా ఖాతా ఉన్నట్లుగా గుర్తించారు. సుమారు 6 కోట్ల మంది ఆన్ లైన్ వ్యాపారులు ఏటా 9 రెట్ల అధిక అమ్మకాల్ని సాధిస్తుంటే.. ఆఫ్ లైన్ దుకాణదారులు 6 రెట్ల వ్రద్ధిని మాత్రమే పొందటం గమనార్హం.