Begin typing your search above and press return to search.

భారత్ వెలుగులు : అణు శక్తి ప్లస్ పవన్ విద్యుత్

భారత దేశం ఇపుడు రక్షణ రంగంలో దీర్ఘ కాలిక వ్యూహాలను అమలు చేస్తోంది.

By:  Satya P   |   27 April 2026 5:00 AM IST
భారత్ వెలుగులు : అణు శక్తి ప్లస్ పవన్ విద్యుత్
X

భారత దేశం ఇపుడు రక్షణ రంగంలో దీర్ఘ కాలిక వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజున ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ అణు శక్తిని మరింతంగా పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న 500 మెగా వాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. ఈ అణు రియాక్టర్‌ను పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఇది అణు శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు ఈ బ్రీడర్ రియాక్టర్ భవిష్యత్తు కోసం కొత్త ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేస్తోంది. అణు శక్తి ద్వారా భారతదేశపు కీర్తిని పెంచినందుకు మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు చెప్పారు.

భారీ పౌర అణు కార్యక్రమం :

భారతీయ శాస్త్రవేత్తలు పౌర అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశ నిర్మాణానికి గణనీయమైన కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి కొనియాడారు. దీనివల్ల పారిశ్రామిక వృద్ధి, ఇంధన రంగం ఆరోగ్య సంరక్షణ రంగం ప్రయోజనం పొందుతాయని ఆయన అన్నారు. భారతదేశ పౌర అణు కార్యక్రమం వ్యవసాయం నుండి ఆధునిక కార్యక్రమాలకు వినూత్న ప్రయోగాలకు కూడా ఇది అందరికీ సహాయపడుతుందని తెలిపారు. భారతదేశ అణుశక్తి ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అని నరేంద్ర మోదీ అభివర్ణించారు.

పవన్ శక్తిలోనూ టాప్ :

మరో వైపు భారత్ పవన్ శక్తి రంగంలోనూ టాప్ గా ఉందని మోడీ గుర్తు చేశారు. పవన్ శక్తి సైతం దేశాన్ని ముందుకు నడిపిస్తోందని అన్నారు. పవన శక్తి రంగంలో భారతదేశ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు 56 గిగావాట్లను దాటిందని గుర్తు చేశారు. గత ఏడాది కాలంలోనే దాదాపు ఆరు గిగావాట్ల కొత్త సామర్థ్యం అదనంగా జోడించబడిందని చెప్పుకొచ్చారు. పవన శక్తి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంటూ, భారతదేశం వేగంగా పురోగమిస్తోందని మోడీ వెల్లడించారు.

యువతకు కొత్త అవకాశాలు :

గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ రంగంలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.

యువతకు కొత్త అవకాశాలు ఉపాధి మార్గాల ద్వారా ప్రయోజనం లభిస్తోందని మోడీ చెప్పారు. దేశ అభివృద్ధికి సౌర, పవన శక్తి అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ను పొదుపు చేయాలని స్వచ్ఛమైన ఇంధనాన్ని స్వీకరించాలని మోడీ గట్టిగా పిలుపు ఇచ్చారు. దేశంలో ప్రతి స్థాయిలో ఇటువంటి ప్రయత్నాలు ఎంతో అవసరమని వీటి వల్లనే సమూలమైన మార్పులు తీసుకువస్తాయని మోడీ వెల్లడించారు.