Begin typing your search above and press return to search.

మీడియా ఫోర్త్ ఎస్టేట్...ఆచరణలో చెక్క భజనేనా ?

ఎక్కడైతే మీడియా అత్యంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఆ దేశంలో అవినీతి తగ్గుతుంది. పారదర్శకత పెరుగుతుంది.

By:  Satya P   |   15 Jun 2026 8:00 PM IST
మీడియా ఫోర్త్ ఎస్టేట్...ఆచరణలో చెక్క భజనేనా ?
X

ఎక్కడైతే మీడియా అత్యంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఆ దేశంలో అవినీతి తగ్గుతుంది. పారదర్శకత పెరుగుతుంది. జవాబుదారీ తనం వస్తుంది. ప్రజలను నాణ్యమైన పాలన కూడా లభిస్తుంది. కానీ భారత్ లాంటి దేశాల్లో మీడియా ఫ్రీడం ఎంత అన్న చర్చ మేధావుల నుంచి విద్యావంతుల దాకా సాగుతోంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఒక నార్వే జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు మోడీ జవాబు చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అది అంతర్జాతీయ స్థాయిలోనే వైరల్ అయింది. ఇంతకీ నార్వే జర్నలిస్ట్ భారత ప్రధానిని ప్రశ్నించే గట్స్ ఎలా వచ్చాయి అంటే నార్వే దేశంలో మీడియా చాలా శక్తివంతంగా ఉంటుంది కనుక అన్న జవాబు వస్తుంది.

వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ లో ఇండియా :

ఇదిలా ఉంటే వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ లో మొత్తం 180 దేశాలు ఉంటే నార్వే నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఆ దేశంలో మీడియా ఇండిపెండెంట్ గా ఉంటుంది. అందుకే దేశాధినేతలు ఎవరిని అయినా నేరుగా ప్రశ్నిస్తుంది. జవాబు చెప్పుకోవాల్సిందే మరి. ఇక ఇండియా ప్లేస్ ఈ ఇండెక్స్ లో 157 గా ఉంది. అంటే భారత్ లో మీడియా ఎందుకు ఇలా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అని గొప్పగా చెబుతారు కదా మరి ఆచరణలో సంగతి ఏంటి అంటే చెక్క భజన చేయడమే అన్న ఆన్సర్ సులువుగా వస్తుంది. మీడియా అంటే ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా నిజాలు చెప్పాలి. కానీ భారత్ లో మీడియా పోటీ తత్వంతో నడుస్తుంది. కార్పోరేట్ ఫండింగ్ కోసం చూస్తుంది. అంతే కాదు చానళ్ళకు టీఆర్పీ రేటింగ్ కావాలి. అందుకే మీడియా ఎపుడూ తన స్వేచ్చను పూర్తిగా ప్రదర్శించిన సందర్భాలు అరుదు అని అంటారు.

మీడియా పవర్ ఫుల్ గా ఉంటే :

మీడియా శక్తివంతంగా ఉంటే కలిగే లాభాలు ఎన్నో ఉంటాయి. కేవలం అధికార పక్షంలో ఉన్న వారే కాదు ప్రతిపక్ష నాయకులు కూడా జడుస్తారు. అంతే కాదు వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. అదే విధంగా జవాబుదారీ తనం అన్నది పెరుగుతుంది. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేయబడుతుంది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క ఉంటుంది. పేదరికం తగ్గుతుంది. అందరికీ సమానంగా ప్రభుత్వ సంపద పంపిణీ చేయబడుతుంది. హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నతమైన సమాజం ఆవిర్భవిస్తుంది. మరి భారత్ లో అలాంటి పరిస్థితి ఉందా అని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంతా అంటున్నారు.

వైఫల్యాల మీద నిలదీయరు :

ప్రభుత్వం చేసే ఎన్నో రకాల వైఫల్యాలను మీడియా ఎందుకు అడగదు అన్న చర్చ కూడా ఇక్కడ వస్తుంది. ఉదాహరణకు బ్లాక్ మనీ ని వెలికి తీస్తామని ఒక పార్టీ చెప్పింది. అది ఆచరణలో జరిగిందా అని ఏనాడూ మీడియా ప్రశ్నించలేదు, అలాగే బేటీ బచావో భేటీ పడావో అందమైన నినాదంగా మారింది. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, స్వచ్చ భారత్ అన్నా ఎక్కడ అది అమలు జరిగింది అని నిలదీసే మీడియా ఉందా అన్నది మరో ప్రశ్న. ఇలా మీడియా మౌనంగా ఉన్నంత కాలం ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

మీడియాను మించినది లేదు :

నిగ్గదీసి అడగాలి, తప్పు చేస్తే నిప్పులతో కడగాలి. వజ్రాయుధం లాంటిది మీడియాకు ఉన్న పవర్ ఐతే అది తుప్పు పట్టి పోయింది అన్న ఆవేదన అందరిలోనూ ఉంది. ఫోర్త్ ఎస్టేట్ అని ప్రజాస్వామ్యంలో మీడియాకు పేరు. మిగిలిన మూడు స్తంభాలు సక్రమంగా ఉన్నా నాలుగవ స్థంభం కనుక సరిగ్గా నిలబడకపోతే కచ్చితంగా ప్రజాస్వామ్య సౌధం కూలుతుంది అని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇక మీడియా తన పని తాను చేయకపోతే ఎవరికి వారే ఇండిపెండెంట్ జర్నలిజాన్ని స్టార్ట్ చేస్తారు. అది అభిప్రాయాల వేదికగా ఉంటూ భిన్న వాదాలకు దారి తీస్తుంది. ఇక నిజాలు కంటే కూడా భావాలే ప్రధానం అయి యూత్ అందులో పడి తన్నుకుంటే కనుక పాలకులకు ఇది కూడా వినోదమే అవుతుంది. ఎంచక్కా చోద్యం చిత్తగిస్తూ తమ పని తాము చేసుకుంటారు అని అంటున్నారు. అందుకే బలమైన మీడియా భారత్ లాంటి దేశాలకు అవసరమని అంటున్నారు. చెంచాలు కొట్టి చెక్క భజన చేసే మీడియాతో ప్రజాస్వామ్య మౌలిక స్వరూపమే ఇబ్బందులో పడుతుందని కూడా మేధావులు హెచ్చరిస్తున్నారు.