Begin typing your search above and press return to search.

వావ్ అనిపించేలా రాంచీ రైల్వే ఫ్లైఓవర్.. స్పెషల్ ఏమంటే?

మొత్తం 2.34 చదరపు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండే ఈ రైల్వే ఫ్లైఓవర్ రాంచీలోని సిరంటోలీ ఏరియా వద్ద నుంచి రైల్వే లైన్.. బ్రిడ్జి మీదుగా వెళుతుంది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 1:00 PM IST
వావ్ అనిపించేలా రాంచీ రైల్వే ఫ్లైఓవర్.. స్పెషల్ ఏమంటే?
X

మూడు రోజుల క్రితం జార్ఖండ్ లోని రాంచీలో ఒక రైల్వే ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అయితే..? అన్న ప్రశ్న మీకు రావొచ్చు. కానీ.. దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకుంటే.. ఈ రైల్వే ఫ్లైఓవర్ దేశంలోనే అత్యంత పొడువైనది. సిరంటోలీ నుంచి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెకాన్ వరకు నిర్మించిన ఈ కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర కు ప్రముఖ గిరిజన నాయకుడు కార్తీక్ ఒరాన్ పేరును పెట్టటం విశేషం. జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ నెల ఐదున దీన్ని ప్రారంభించారు.దీనికి ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే.. ఇదెంత ఇస్పెషల్ అన్నది అర్థమవుతుంది.

రాంచీ పరిధిలోని రైల్వే లైన్ పై 132 మీటర్లు పొడవునా కేబుల్స్ దన్నుగా చేసుకొని నిలిచేలా ఈ వంతెనను నిర్మించారు. దీన్ని రాంచీలోని హర్ము నది - పాత ఓవర్ బ్రిడ్జి ఏరియాల మీదుగా నిర్మించారు. దీని రెండో సెక్షన్ మీదుగా వెళ్లే సమయంలో పరిసర ప్రాంతాల్ని చూస్తే.. డబుల్ డెక్కర్ రైలు లేదంటే బస్సులో వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ కేబుల్ ఫ్లైఓవర్ మీద నుంచి ప్రయాణించే వేళలో.. చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.

మొత్తం 2.34 చదరపు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండే ఈ రైల్వే ఫ్లైఓవర్ రాంచీలోని సిరంటోలీ ఏరియా వద్ద నుంచి రైల్వే లైన్.. బ్రిడ్జి మీదుగా వెళుతుంది. రూ.372 కోట్లతో నిర్మించిన ఈ కేబుల్ ఫ్లైఓవర్ ను నిర్మించేందుకు రెండేళ్ల తొమ్మిదిన్నర నెలల్లో పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్ పనులను దిగ్గజ ఎల్ అండ్ టీ నిర్మించింది. దీని నిర్మాణానికి అవసరమైన కేబుల్స్ ను మలేసియా నుంచి తెప్పించారు. ప్రతి కేబుల్ 45 నుంచి 54 వైర్లను కలిగి ఉంటుంది. ఈ కేబుల్స్ వంతెన నిలిచేందుకు బలాన్ని ఇస్తుంది. వంతెన డిజైన్ కు సంబంధించి ఐఐటీ ముంబయి నిపుణులతోపాటు.. జార్ఖండ్ రోడ్డు నిర్మాణ విభాగం నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నారు.

మరో ప్రత్యేకత ఏమంటే.. ఈ ఫ్లైఓవర నిర్మాణానికి 42 భారీ స్తంభాలతో పాటు.. 72 కేబుల్స్ ను వినియోగించారు. అంతేకాదు.. ఈ వంతెన చుట్టు ఉండే ఇళ్లు.. అపార్టుమెంట్ల వారికి శబ్దాలు కలగకుండా ఉండేందుకు ఫ్లైఓవర్ రెయిలింగ్ పై 1.6 మీటర్ల ఎత్తున సౌండ్ ఫ్రూప్ క్రాష్ బారియర్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. అందంగా కనిపించేందుకు ఈ కేబుల్ ఫ్లైఓవర్ పై ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేశారు. ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి జాతీయ జెండా రంగుల్ని విరజిమ్ముతాయి. మొత్తంగా ఈ రైల్వే కేబుల్ ఫ్లైఓవర్ ను చూడటం అందమైన అనుభూతిని కలిగిస్తుందని మాత్రం చెప్పక తప్పదు.