యువరానర్: యాభై వేల మందికి ఒక్కరే న్యాయమూర్తి
ఈ దేశంలో న్యాయవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జనాభాకు తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో న్యాయం సత్వరంగా లభించడం లేదు.
By: Satya P | 1 Feb 2026 5:00 AM ISTఈ దేశంలో న్యాయవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జనాభాకు తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో న్యాయం సత్వరంగా లభించడం లేదు. మహా కవి శ్రీశ్రీ అన్నట్లుగా న్యాయం ఆలస్యం అయితే అది చివరికి అన్యాయంగానే మారుతుంది. ఇపుడు దేశంలో తగినంత మంది న్యాయమూర్తులు లేక న్యాయ వ్యవస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా చూసే లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 120వ నివేదికలో ప్రతీ పది లక్షల మందికి 50 మంది అయినా న్యాయ మూర్తులు ఉండాలని స్పష్టం చేసింది.
తగినంత మంది లేక :
దేశంలో న్యాయ వ్యవస్థలో తగినంత మంది న్యాయమూర్తులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ దేశంలో చూస్తే అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ 33 మంది ఉన్నారు. హైకోర్టులలో 1122 మంది ఉండాల్సింది కానీ ప్రస్తుతం 814 మంది మాత్రమే ఉన్నారు. అలాగే దిగువ కోర్టులలో చూస్తే 20, 833 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అయితే పెండిగ్ కేసులు చూస్తే దేశంలో అధికంగా ఉన్నాయి. దాంతో ప్రతి పది లక్షల మందికి కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉంటే నిష్పత్తి సరిపోతుంది అని అంటున్నారు. కానీ అది మాత్రం జరగడం లేదు. ఇప్పటికి ఉన్న దాని కంటే రెట్టింపు జడ్జీల నియామకం కావాల్సి ఉందని అంటున్నారు.
జనాభాకు తగినంతగా :
భారత్ లాంటి దేశంలో 144 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇక కేసులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అవి దిగువ కోర్టుల నుంచి సుప్రీం కోర్టుల దాకా అలా పేరుకుని పోతున్నాయి. 2025 నాటికి చూస్తే కనుక భారత సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు 90,000కి పెరిగాయి. ఇక దిగువ కోర్టులలో 4.6 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఇక కోర్టులలో ఎక్కువగా పని ఒత్తిడి ఉండడంతో జైళ్ళలో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య చూస్తే అంతకంతకు పెరిగిపోతోంది. 2023 నాటికి చూస్తే మూడు లఖల 90 వేల దాకా అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. అయితే వేగంగా న్యాయం అందించాలని కోర్టులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కోర్టులను తీసుకుని వస్తున్నారు. అలాగే మిషన్ మోడ్ ప్రాజెక్టుల ద్వారా టెక్నాలజీని తీసుకుని వస్తున్నారు. అయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సి ఉందన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగినంత చొరవ తీసుకోవాల్సి ఉంది. న్యాయం వేగంగా అందితే అది ఎంతో అభివృద్ధికి కూడా సూచికగా ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా అడుగులు పడాల్సి ఉంది.
