Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కు రష్యా చమురు మహా సవక.. సవక

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి మూడేళ్లు.. ఈ వ్యవధిలో ఉక్రెయిన్ అక్షరాలా రూ.50 లక్షల కోట్లకు పైగానే నష్టపోయింది.

By:  Tupaki Desk   |   26 Feb 2025 2:00 AM IST
ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కు రష్యా చమురు మహా సవక.. సవక
X

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి మూడేళ్లు.. ఈ వ్యవధిలో ఉక్రెయిన్ అక్షరాలా రూ.50 లక్షల కోట్లకు పైగానే నష్టపోయింది. అంతులేని సంక్షోభంలో చిక్కుకుంది. మరికొన్నేళ్లయినా గానీ.. ప్రపంచం అంతా సాయంచేసినా కానీ.. ఉక్రెయిన్ కోలుకుంటుందా? లేదా? చెప్పలేని పరిస్థితి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక యుద్ధానికి ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. అయితే, అది ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా కావడం గమనార్హం.

సరిగ్గా మూడేళ్ల కిందట ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలుపెట్టగానే అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షల కొరడా ఝళిపించాయి. తద్వారా రష్యాను కుదేలు చేయాలని చూశాయి. దాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేయొచ్చని భావించాయి.

రష్యాకు ప్రధాన ఆదాయ వనరు ముడి చమురు. అది ఎగుమతి కాకుండా ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు వెనక్కుతగ్గాయి. అయితే, ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతిదారు అయిన భారత్.. మాత్రం రష్యా చమురు కొనుగోలును ఆపలేదు.

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి మీరెందుకు చమురు కొంటున్నారు? అనే ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలో దీటైన సమాధానం ఇచ్చారు. ఎందుకు కొనకూడదు? అంటూ ఎదురు ప్రశ్నించారు.

ఇక గత ఏడాది భారత్ రష్యా నుంచి 49 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది. గతంలో పశ్చిమాసియా నుంచి చమురు కొనేది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురు ధర తగ్గడంతో ఆ దేశం నుంచి దిగుమతి ప్రారంభించింది. ఇది ఎంతగా పెరిగిందంటే.. మొత్తం ముడి చమురు దిగుమతుల్లో ఒక శాతం నుంచి 40 శాతానికి పెరిగింది.

భారత్ లోని కొన్ని శుద్ధి కర్మాగారాలు రష్యా ముడి చమురును పెట్రోల్, డీజిల్ గా మారుస్తాయి. వీటిని యూరప్, ఇతర జి-7 దేశాలకు ఎగుమతి చేస్తారు.