Begin typing your search above and press return to search.

ఇది పాకిస్థాన్ లో ప్రజల పరిస్థితి... వీడియో వైరల్!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 May 2025 6:00 PM IST
After Pahalgam Attack as Pakistan Faces Deepening Economic Crisis
X

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్ మొదలైన దేశాలు భారత్ కు మద్దతు పలికిన పరిస్థితి. మరోపక్క పాకిస్థాన్ పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు పాక్ అడ్డాగా నిలుస్తుందనే చర్చ బలంగా నడుస్తుంది.

ఇక పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే.. ఐఎంఎఫ్ ఇచ్చే అప్పుపైనే పాక్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి. మరోపక్క సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడంతో పాక్ ‘కరువు ఫ్యూచర్’ కళ్ల ముందు కనిపిస్తుందని అంటున్నారు.

పాకిస్థాన్ లో ఇప్పటికే చాలా మంది ప్రజలకు సరైన తిండి, బట్టా లేదని.. ప్రధానంగా రోజు రోజుకీ దిగజారిపోతున్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి.. అక్కడి సామాన్య ప్రజానికం రోజువారి జీవనాన్ని మరింత దుర్భర స్థితికి తెచ్చేసిందని అంటున్నారు. మరోపక్క పాక్ కు పంపించే ఎగుమతులను భారత్ నిలిపేసింది. ఈ సమయంలో పాక్ పరిస్థితిని చూపిస్తూ ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

అవును... పాకిస్థాన్ లోని పరిస్థితులకు, ప్రజల స్థితిగతులకు అద్దం పట్టేలా ఓ వీడియో నెట్టింట హల్ చల్ చెస్తుంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే... ఇక్కడి నాయకులు మాత్రం భారత్ తో యుద్ధంపై మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నారనే ఆలోచన వచ్చే విధంగా ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఓ ప్రాంతం, అందులోని ప్రజల అధ్వాన్న స్థితి ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

దీంతో... ఇంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో, అధ్వాన్న స్థితిలో ఉన్న దేశాన్ని చక్కబెట్టుకోకుండా, సరిదిద్దుకోకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. అన్నం పెడుతున్న భారత్ వంటి దేశం చేయి కొరికే ఆలోచన చేయడం మూర్ఖత్వం కాక మరేమిటంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

కాగా... పాకిస్థాన్ కు భారత్ నుంచి పెద్దమొత్తంలో అవసరమైన పండ్లు, కూరగాయలు, కోళ్ల దాణా, డ్రైఫ్రూట్స్ ఎగుమతి అవుతుంటాయనే సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వాణిజ్యాన్ని నిలిపివేయడం వల్ల ఈ వస్తువుల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా సామాన్య పాకిస్థానీయుల దైనందిన జీవితాలు మరింత దిగజారిపోయాయని చెబుతున్నారు.

మరోపక్క... ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. బియ్యం, కూరగాయలు, పిండి, చికెన్, పండ్లు, కోడి గుడ్లు, పాలు వంటి ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు బాగా పెరిగాయని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో పాక్ కు ఫార్మా ఉత్పత్తులను బంద్ చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.