12 మెట్లు దిగజారిన `విశ్వగురు`.. శాంతి మంత్రం!
విశ్వగురువుగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ శాంతిని ప్రోత్సహిస్తుందని.. కేంద్రం పెద్దలు పదే పదే చెబుతారు.
By: Garuda Media | 13 Jun 2026 3:39 PM ISTవిశ్వగురువుగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ శాంతిని ప్రోత్సహిస్తుందని.. కేంద్రం పెద్దలు పదే పదే చెబుతారు. అంతేకాదు... ప్రధాని మోడీ సైతం.. తాము శాంతి కాముకలమని అంటారు. యుద్ధాలను.. అశాంతిని.. దాడులను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని కూడా ఉద్ఘాటిస్తారు. మరి అలాంటి.. విశ్వగురు నేతృత్వంలో భారత దేశం ఎలా ఉండాలి? ప్రపంచానికి శాంతిని ప్రభోదిస్తున్న ప్రధాని మోడీ హయాంలో దేశం శాంతికాముకతలో ఎలా విలసిల్లాలి? అంటే.. ఎవరూ.. నెంబర్1, 2 కనీసంలో కనీసం.. 10 స్థానాల్లో అయినా ఉందని అనుకుం టాన్నారు.
కానీ.. అలా ఉందా? భారత దేశం పరిస్థితి.. పైకి చెబుతున్నట్టుగా శాంతి కాముకతను ప్రదర్శిస్తోందా? అంటే.. తాజాగా వెలువ డిన `ప్రపంచ శాంతి దేశాల సూచీ`లో మన దేశం గత ఏడాదికంటే.. 12 పాయింట్లు దిగజారి.. 127వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఈ సూచీలో మన దేశం 115వ స్థానంలో ఉండడం గమనార్హం. అయితే.. ఈ సూచీ.. ఈ లెక్కలు.. వంటివి మోడీ ప్రత్యర్థులో.. కాంగ్రెస్ పార్టీ నాయకులో.. ఆయనంటే గిట్టనివారో ఇచ్చినవి కాదు. సాక్షాత్తూ ప్రపంచ దేశాలు అంగీకరించిన... ఒక గౌరవ ప్రదమైన, పారదర్శకమైన సంస్థగా గుర్తింపు పొందిన `ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్`(ఐఈపీ) వెల్లడించింది. దీనిని పలు దేశాలు ఆమోదించాయి.
మనకన్నా మేలు...
+ బంగ్లాదేశ్‌లో రెండేళ్ల కిందట విద్యార్థి ఉద్యమం తలెత్తి.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాత్రికి రాత్రి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అలాంటి అల్లర్లతో అట్టుడుకిన బంగ్లాదేశం కంటే కూడా.. భారత్ వెనుకబడింది. ఈ సూచీలో బంగ్లాదేశ్.. 117వ స్థానంలో ఉంటే.. భారత్ 127లో ఉంది.
+ నిరంతరం సంఘర్షణతో ఉండే నేపాల్.. శాంతియుత దేశాల్లో ఎక్కడో ఓ మూలన ఉంటుందని.. భారత్‌ను ఈ దేశం అధిగ మించదని అనుకునే వారు ఉన్నారు. కానీ, అలా అనుకుంటే.. తప్పులో కాలేసినట్టేనని తాజా శాంతి సూచీ వెల్లడించింది. నేపాల్ 111వ స్థానంంలో ఉంటే.. భారత్ 127వ స్తానంలో ఉంది.
+ మొత్తం 163 దేశాల్లో శాంతియుత పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఆయా దేశాల్లో భారత్ 127వ స్థానంలో ఉండడం గమనార్హం.
+ శాంతియుత దేశాల్లో తొలి 3 స్థానాల్లో ఉన్న దేశాలు : 1) ఐస్‌ల్యాండ్. 2) న్యూజిల్యాండ్. 3) స్విట్జర్లాండ్.
మన పరిస్థితికి రీజనేంటి?
ప్రపంచానికి శాంతిని ప్రవచిస్తున్న భారత్.. శాంతి సూచీలో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నది ఆసక్తికర అంశం. దీనికి ప్రధానంగా.. మూడు కారణాలు కనిపిస్తున్నాయని.. ఐఈపీ తెలిపింది.
1) జాతుల మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి.(ఉదాహరణ మణిపూర్. నాగాలాండ్.. తదితర ఈశాన్య రాష్ట్రాలు.).
2) దేశ భద్రత(ఉదాహరణ.. పహల్గాంలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి. దీనిని ముందుగా అంచనా వేయలేక పోయిన దైన్యం. 21 మంది మృతి చెందడం.)
3) సరిహద్దుల అస్థిరత( రాష్ట్రాల మధ్య స్థిరమైన విధానం లేకపోవడం.. ప్రజల్లో కలవరం పెరుగుతుండడం.)
