Begin typing your search above and press return to search.

పాక్ మాడు పగిలేలా భారత్ దౌత్య యుద్ధం

పాకిస్థాన్ పీచమణచేందుకు భారత్ సర్వ సిద్ధంగా ఉంది. పాకిస్థాన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే సమస్య లేదని భారత్ గట్టిగా భావిస్తోంది.

By:  Tupaki Desk   |   19 May 2025 8:00 AM IST
పాక్ మాడు పగిలేలా భారత్ దౌత్య యుద్ధం
X

పాకిస్థాన్ పీచమణచేందుకు భారత్ సర్వ సిద్ధంగా ఉంది. పాకిస్థాన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే సమస్య లేదని భారత్ గట్టిగా భావిస్తోంది. వ్యవహారం ఇంతదాకా వచ్చాక ఏ మాత్రం తగ్గినా అది వేరే విపరిణామాలకు దారితీస్తుందని కూడా ఆలోచిస్తున్నారు.

అందుకే పాక్ ని పూర్తిగా ప్రపంచం ముందు నిలబెట్టి నిజస్వరూపం స్పష్టంగా చెప్పాలని భారత్ ఆలోచిస్తోంది. ఈ నేపధ్యంలోనే పాకిస్తాన్ వండి వారుస్తున్న ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తూ పాక్ ని ఒంటరిని చేయాలని భారత్ సంకల్పించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పక్షాలకు చెందిన అఖిల పక్షం ప్రతినిధులతో కూడిన ఏడు బృందాలను కెలక దేశాలకు పంపిస్తోంది.

ఇక చూస్తే కనుక 59 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఏడు బృందాలు మొత్తం 32 దేశాలను సందర్శిస్తాయి. ప్రతి ప్రతినిధి బృందంలో ఒక రిటైర్డ్ దౌత్యవేత్త కూడా ఉంటారు. బిజెపి ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని మొదటి బృందం సౌదీ అరేబియా బహ్రెయిన్, కువైట్ అల్జీరియాలను సందర్శిస్తుంది. ఈ బృందంలో ప్రముఖ నాయకుడు గులాం నబీ ఆజాద్, బిజెపి ఎంపీ నిషికాంత్ దుబే,మజ్లీస్ కి చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు.

అదే విధంగా బిజెపి ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని రెండవ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, అరబి ఎమిరేట్స్, ఇటలీ డెన్మార్క్‌లను సందర్శిస్తుంది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్, శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది మాజీ కేంద్ర మంత్రి ఎం జే అక్బర్ ఉన్నారు.

మూడవ ప్రతినిధి బృందానికి జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నాయకత్వం వహిస్తారు, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్ సింగపూర్‌లను ఈ బృందం సందర్శిస్తారు. ఈ ప్రతినిధి బృందంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన యూసుఫ్ పఠాన్, సీపీఎం కి చెందిన జాన్ బ్రిట్టాస్ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు.

శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని నాలుగవ బృందం యూఏఐ, లైబీరియా, కాంగో సియెర్రా లియోన్‌లను సందర్శిస్తుంది. బీజేపీకి చెందిన బన్సూరి స్వరాజ్, బీజేడీకి చెందిన సస్మిత్ పాత్ర, ఐయూఎం ఎల్ ఎంపీ ఈటీ మహమ్మద్ బషీర్ మాజీ కేంద్ర మంత్రి ఎస్ ఎస్ అహ్లువాలియా కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉంటారు.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఐదవ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్ కొలంబియాలను సందర్శిస్తుంది. జేఎంఎం ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్జేడీ ఎంపీ శాంభవి, టీడీపీ ఎంపీ జీఎం హరీష్ బాలయోగి శివసేన ఎంపీ మురళీ దేవరా ఈ బృందంలో ఉన్నారు.

డీఎంకేకు చెందిన ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని ఆరవ బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా రష్యాలను సందర్శిస్తుంది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్, సమాజవాది పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఆర్జేడీ ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా ఉన్నారు.

ఏడవ బృందానికి ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీ సుప్రియా సులే నాయకత్వం వహిస్తారు, ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా దక్షిణాఫ్రికాలను ఈ బృందం సభ్యులు సందర్శిస్తారు. ఈ ప్రతినిధి బృందంలో బిజెపికి చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ అనురాగ్ సింగ్ ఠాకూర్, మాజీ కేంద్ర మంత్రి వి. మురళీధరన్ అలాగే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా ఉంటారని కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజుజీ ఎక్స్ పోస్టు ద్వారా వెల్లడించారు.

ఇక చూసుకుంటే ఈ అఖిల పక్ష బృందంలో దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు అవకాశం దక్కింది. అంతే కాదు ప్రతీ బ్రందంలో మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీని ఉండేలా చర్యలు తీసుకున్నారు. కీలక దేశాలలో ఈ బృందాలు పర్యటించి పాక్ తయారుచేస్తున్న ఉగ్రవాదాన్ని విడమరచి చెబుతారు. అంతే కాదు పాక్ విషయంలో భారత్ గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తారని అంటున్నారు.