Begin typing your search above and press return to search.

డ్రోన్స్ ఎగుమతి హబ్ గా భారత్... షాకింగ్ గా జాబ్స్, మార్కెట్ లెక్కలు!

భారత్ లో డ్రోన్ల పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో స్వదేశీ సాంకేతికపై దృష్టి సారిస్తూ అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 May 2025 1:53 PM IST
డ్రోన్స్ ఎగుమతి హబ్ గా భారత్... షాకింగ్ గా జాబ్స్, మార్కెట్ లెక్కలు!
X

భారత్ లో డ్రోన్ల పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో స్వదేశీ సాంకేతికపై దృష్టి సారిస్తూ అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.ఓ) మానవ రహిత విమానం డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. ఇదే సమయంలో.. మరికొన్ని ప్రముఖ సంస్థలూ ఈ అధునాతన డ్రోన్ల తయారీని చేపడుతున్నాయి.

అవును... భారత్ లో డ్రోన్ల పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే డీ.ఆర్.డీ.ఓ మానవ రహిత విమానం డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. మరోపక్క అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ అధునాతన డ్రోన్ల తయారీని చేపడుతున్నాయి. వీటిని సరిహద్దులో నిఘా, యుద్ధం కోసం రూపొందిస్తున్నారు!

వాస్తవానికి ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఇజ్రాయెల్ టెక్నాలజీతో బెంగళూరు స్టార్టప్ తయారు చేసిన స్కై స్ట్రైకర్ ఆత్మాహుతి డ్రోన్లను సైన్యం వినియోగించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. హైదరాబాద్ కు చెందిన మారుత్ డ్రోన్స్ లాంటివి సైన్యానికి అవసరమైన ఔషదాలు, సరుకుల రవాణాకు కీలకంగా పనిచేశాయి.

ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ల రంగానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సకాలు అందుతున్నాయి. ఇందులో భాగంగా.. 2024లో ప్రవేశపెట్టిన డ్రోన్ శక్తి పథకం, రక్షణ డ్రోన్ల అభివృద్ధికి నిధులను కేటాయించింది. ఈ సమయంలో స్టార్టప్ లకు రాయితీలు, రీసెర్చ్ కోసం గ్రాంట్లు అందిస్తోంది.

ఈ క్రమంలో భారత డ్రోన్ మార్కెట్ విలువ రాబోయే ఐదారేళ్లలో (2030 నాటికి) సుమారు రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇంద్లో రక్షణ డ్రోన్లదే అధిక వాటా కాగా... తర్వాత స్థానంలో వ్యవసాయం, విపత్తు నిర్వహణ, లాజిస్టిక్స్ మొదలైన విభాగాల్లోనూ డ్రోన్లకు అధిక గిరాకీ ఉంటోందని అంటున్నారు.

ఈ విధంగా డ్రోన్ల తయారీ రంగం అభివృద్ధి చెంది, భవిష్యత్తులో మన దేశాన్ని డ్రోన్ల ఎగుమతి హబ్ గా మార్చేందుకు దోహదం చేస్తాయని అంటున్నారు. ఈ సందర్భంగా... ఈ రంగంలో వేలాది కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రధానంగా సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, తయారీ రంగాల్లో నిపుణులకు అధిక గిరాకీ ఉంటోందని చెబుతున్నారు.