Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ ఇక చుచ్చు పోసుకోవాల్సింది.. భారత అమ్ములపొదిలే భీకర అస్త్రాలు.. సక్సెస్

భారత రక్షణ పరిశోధన సంస్థలు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమ్ములపొదిలో అత్యాధునిక అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి.

By:  A.N.Kumar   |   20 May 2026 1:53 PM IST
పాకిస్తాన్ ఇక చుచ్చు పోసుకోవాల్సింది.. భారత అమ్ములపొదిలే భీకర అస్త్రాలు.. సక్సెస్
X

ఒకప్పుడు రక్షణ అవసరాల కోసం విదేశాల వైపు చూసిన భారతదేశం.. నేడు స్వదేశీ సాంకేతికతతో ప్రపంచ దేశాలు అసూయపడే స్థాయికి చేరింది. హైపర్‌సోనిక్ క్షిపణుల గర్జనలు.. స్టెల్త్ ఫైటర్ జెట్ల విన్యాసాలు, అణుశక్తి సామర్థ్యం.. వెరసి 'ఆత్మనిర్భర భారత్' ప్రపంచానికి సరికొత్త రక్షణ పాఠాలు నేర్పుతోంది.

ఆయుధాల కథ కాదు.. భారత యువత కలల గాథ!

ఇది కేవలం యుద్ధ విమానాలు, క్షిపణుల గురించిన ముచ్చట కాదు. దేశ రక్షణ కోసం రాత్రింబవళ్లు ల్యాబ్‌లలో శ్రమిస్తున్న వేలాది మంది యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకుల అంకితభావానికి నిదర్శనం. “ఆత్మనిర్భర భారత్” అనేది ఇప్పుడు కేవలం ఒక నినాదం కాదు.. అది ప్రపంచం మోకరిల్లే ఒక తిరుగులేని శక్తి!

భవిష్యత్ యుద్ధాలకు భారత్ వ్యూహాత్మక సన్నద్ధత

భారత రక్షణ పరిశోధన సంస్థలు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమ్ములపొదిలో అత్యాధునిక అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. బ్రహ్మోస్-II హైపర్‌సోనిక్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో ఒకటిగా నిలవబోతోంది. మాక్-8 ధ్వని కంటే 8 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి శత్రువుల రాడార్లకు అందకుండా లక్ష్యాన్ని తుత్తునియలు చేస్తుంది. ఏఎంసీఏ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్. శత్రువుల గుండెల్లో నిద్రపోతూ, వారి రాడార్ నెట్‌వర్క్‌ను సైతం బురిడీ కొట్టించగల అద్భుత సామర్థ్యం దీని సొంతం. అగ్ని-VI ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 10,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల ఈ క్షిపణి, భారత్‌ను గ్లోబల్ సూపర్ పవర్స్ సరసన నిలబెట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో వెలిగిన భారత ప్రతిభ.. కర్నూలు ప్రయోగం సక్సెస్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్.డీఓ) నిర్వహించిన యూఎల్.పీజీఎం-వీ3 క్షిపణి ప్రయోగం దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. గాల్లో నుంచి గాల్లోకి, అలాగే గాల్లో నుంచి నేలపైకి ఏకకాలంలో లక్ష్యాలను ఛేదించగల ఈ మిస్సైల్‌ను పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. ఈ అద్భుత విజయానికి హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), డీఆర్డీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వెన్నుముకగా నిలిచాయి. ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో పాటు దేశీయ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కలిసి పనిచేయడం “మేక్ ఇన్ ఇండియా” సాధించిన అసలైన విజయం.

నవభారత యువతకు ఇది గొప్ప సందేశం

ఒకప్పుడు సాంకేతికత కోసం ఇతర దేశాలపై ఆధారపడిన మనం.. నేడు ప్రపంచ దేశాలకే టెక్నాలజీని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఈ మార్పు వెనుక ఉన్న అసలు సిసలైన బలం మన యువత. దేశం కోసం కలలు కనడం.. వాటిని నిజం చేయడం.. ఇదే నేటి భారత శాస్త్రవేత్తలు అందిస్తున్న సందేశం. నేడు కాలేజీ ల్యాబ్‌లో ఒక విద్యార్థి చేస్తున్న చిన్న ప్రయోగమే.. రేపు దేశ భద్రతను కాపాడే ఒక అజేయమైన కవచంగా మారవచ్చు! మన శత్రుదేశం పాకిస్తాన్ మన ఈ అత్యాధునిక ఆయుధాలు చూసి చుచ్చుపోసుకోవాల్సిందే..

"ఆత్మనిర్భర భారత్"కు సరికొత్త అర్థం

రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న ఈ పురోగతి కేవలం సైనిక బలానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంకేతిక స్వేచ్ఛకు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కాలం మారుతోంది.. ప్రపంచం మారుతోంది.. ఆ మార్పుతో పాటు "మన దేశం ఏదైనా చేయగలదు" అనే దృఢమైన నమ్మకం ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది!