Begin typing your search above and press return to search.

రోజు రోజుకీ పెరుగుతోన్న కోవిడ్ కేసులు.. మొత్తం మరణాల సంఖ్య ఇదే!

అవును... కోవిడ్ కేసులు దేశంలో రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. కోవిడ్ వైరస్ బారినపడిన వారి సంఖ్య, మరణాల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 11:30 PM IST
రోజు రోజుకీ పెరుగుతోన్న  కోవిడ్  కేసులు.. మొత్తం మరణాల సంఖ్య ఇదే!
X

దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఎవరికి వారు ఉన్నంతలో స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ.. ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య తాజాగా ఆరు వేలు దాటిన పరిస్థితి. ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో కోవిడ్ వైరస్ బారిన పడినవారి సంఖ్య ఆరు వేలు దాటగా మరణాలు 60 దాటినట్లు తెలిపింది!

అవును... కోవిడ్ కేసులు దేశంలో రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. కోవిడ్ వైరస్ బారినపడిన వారి సంఖ్య, మరణాల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా... జూన్ 8 (ఆదివారం) ఉదయం 8 గంటల వరాకూ దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కు చేరగా.. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య 378.

ఇదే సమయంలో... గత 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 65కి చేరినట్లు వెళ్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా యాక్టివ్ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా.. కేరళలో అత్యధికంగా 1950 యాక్టివ్ కేసులు ఉండగా.. ఆ తర్వాత స్థానంలో గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసుల సంఖ్య!:

కేరళ - 1950

గుజరాత్ - 822

వెస్ట్ బెంగాల్ - 693

ఢిల్లీ - 686

మహారాష్ట్ర - 595

కర్ణాటక - 366

ఉత్తరప్రదేశ్ - 219

తమిళనాడు - 194

రాజస్థాన్ - 132

హర్యానా - 102

ఆంధ్రప్రదేశ్ - 86

బీహార్ - 49

ఛత్తీస్ గఢ్ - 41

మధ్యప్రదేశ్ - 39

పంజాబ్ - 35

ఒడిశా - 33

సిక్కిం - 23

పుదుచ్చేరి - 15

తెలంగాణ - 10

జమ్మూ కశ్మీర్ - 9

గోవా - 9

ఉత్తరాఖండ్ - 9

అస్సాం - 6

ఝార్ఖండ్ - 4

హిమాచల్ ప్రదేశ్ - 3

చండీగఢ్ - 2

త్రిపుర - 1

చొప్పున వైరస్ బారిన పడగా.. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం లలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది.